తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడానికి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు.. దూకుడు స్వభావంతో ముందుకెళ్తున్న ఆ పార్టీ నాయకులు కేసీఆర్ ఆలోచనలు అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటిదురుసు బీజేపీకి బాగా మైనస్ అవుతోంది. అయితే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ సమయంలో బండి సంజయ్ ను చేస్తే బీజేపీ మరింత డ్యామేజ్ అవుతుందని.. అతడికి కేంద్రంలో పదవి ఇచ్చి సాగనంపాలని స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. బండి సంజయ్ కి కేంద్రంలో సముచిత స్థానం ఇస్తారని, రాష్ట్రంలో ఈటల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ ప్రచారం బీఆర్ఎస్ సృష్టించిందా..? లేక నిజంగానే బండి సంజయ్ ని కేంద్రం సీఎం అభ్యర్థి నుంచి తప్పిస్తుందా..? అని అనుకుంటున్నారు.
తెలంగాణలో 2018 వరకు బీజేపీ మూడో స్థానంలో ఉంది. కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండిసంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంతో ఆ పార్టీ పరిస్థితి మారింది. అప్పటికే యూత్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న బండి సంజయ్ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇతర నాయకుల సహకారంలో బీజేపీని గెలిపించారు. దీంతో బీజేపీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారింది. అటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రెండు స్థానాలను కోల్పోవడంతో ఫోకస్ అంతా బీజేపీపై ఉంచింది. కానీ రాష్ట్ర నాయకులను పట్టించుకోకుండా కేంద్రంపై పోరాటం ప్రకటిస్తూ పలు విమర్శలు, ఆరోపణలు చేసింది.
ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విపరీతంగా రెచ్చిపోయారు. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ ఎస్ నాయకులపై పరుష వ్యాఖ్యలతో బీజేపీపై ఉన్న అభిమానం సన్నగిల్లుతూ వచ్చింది. కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేసిన బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధిపై, ప్రయోజనాలపై మాట్లాడలేకపోయారు.
దీంతో కొందరు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని చేకూరుస్తున్నాయని భావించారు. ఈ కారణంగానే ప్రజలకు బీజేపీ దూరం అవుతున్నారనే ప్రచారం సాగింది. ఈ విషయాలను గమనించిన కేంద్రం బండి సంజయ్ కి సీఎం అయ్యే అవకాశం ఇస్తే తెలంగాణలో కొంప మునగడం ఖాయం అని ఆలోచనలో పడింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదరాభిమానం ఉన్న ఈటల రాజేందర్ కు ఇస్తే ఎలా..? అని చర్చిస్తున్నట్లు సమాచారం. బీసీకి చెందిన ఈటల రాజేందర్ ను సీఎం అభ్యర్థిని చేయడం వల్ల తమది బీసీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చని అనుకుంటోంది. మరోవైపు బీఆర్ఎస్ లో సుధీర్ఘంగా పనిచేసి ఆ పార్టీ వీడిన ఈటలను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వల్ల గులాబీ పార్టీలోని వారిని చేర్చుకోవచ్చని ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఈటల రాజేందర్ సరైన వ్యక్తిగా ఉంటారని భావిస్తోంది.
అయితే ఈ ప్రచారం బీఆర్ఎస్ సృష్టించిందా..? లేక నిజంగానే కేంద్రం అలా ఆలోచిస్తుందా..? అనేది క్లారిటీ లేదు. కానీ బండి సంజయ్ సీఎం అభ్యర్థి అయితే ఓ వర్గం దూరమయ్యే అవకాశం ఉంది. అలా అని ఆయనను సీఎం అభ్యర్థిని చేయకపోతే యూత్ ఫాలోయింగ్ దెబ్బతింటోంది. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి సంతృప్తి పరిచి పార్టీ కోసం పనిచేసేలా ఉపయోగించుకుంటారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఎలాగూ పోటా పోటీ ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఎన్నికల్లోకి వెళ్తే అన్ని విధాలా సహకారం ఉంటుందని అంటున్నారు. కానీ అలా చేస్తే బండి సంజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.