గుజరాత్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయించి.. చివరకు ప్రధాని మోడీ సైతం స్పందించేలా ఉద్యమ మంట పెట్టిన గుజరాత్ కు చెందిన ఉద్యమనేత హార్దిక్ పటేల్ కు సంబంధించిన ఒక వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.
ఒక థాయ్ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉంటూ.. రాసలీలకు పాల్పడినట్లుగా ఉన్న ఈ వీడియో నిజానికి నాలుగు రోజుల ముందే ఇంటర్నెట్ లో దర్శనమిచ్చింది. ఈ వీడియోలో కనిపిస్తున్న హార్దిక్ పటేల్ నిజంగా హార్దిక్ పటేలేనా? ఆ రూపంలో ఉన్న వ్యక్తా అన్న సందేహం ఒకటైతే.. ఈ వీడియోను మార్ఫింగ్ చేసినట్లుగా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్ ప్రభుత్వాన్ని వణికించి.. పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఇలాంటి వీడియోను రూపొందించి ఉంటారన్న ఊహాగానాలు ఒకపక్క సాగుతుంటే.. మరోవైపు మాత్రం.. అతగాడు తన స్నేహితులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన సందర్భంగా ఒక విదేశీ మహిళతో రాసలీలలు జరిపారన్న దానికి తాజా వీడియోనే సాక్ష్యం అని చెబుతున్నారు.
ఈ విషయంపై హార్దిక్ పటేల్ వర్గీయులు సింఫుల్ గా కొట్టి పారేస్తున్నారు. ఈ వీడియో (?) బయటకు వచ్చి నాలుగు రోజులు అవుతున్నా.. బుధవారం నుంచి పలు మీడియా సంస్థలు దీనిపై దృష్టి సారించి వార్తలు అందిస్తున్నాయి. అయితే.. ఇవేవీ కూడా సీడీకి సంబంధించిన సమాచారాన్ని.. అందులో ఉన్నది హార్దిక్ పటేల్ అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయలేకపోవటం గమనార్హం.
సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి నిజానిజాలు బయటకు రావటమో లేదంటే.. హార్దిక్ పటేల్ పాస్ పోర్టతో పాటు.. అతను విదేశీ మహిళతో గడిపినట్లుగా మరిన్ని ఆధారాలు లభిస్తే తప్ప.. నిజమని నమ్మలేని పరిస్థితి. వీడియోలో కనిపిస్తున్న నలుగురు యువకుల్లో ఒకరు హార్దిక్ పటేల్ కు దగ్గర పోలికలు ఉన్నట్లుగా కనిపిస్తున్నా.. అతడే హార్దిక్ పటేల్ అని చెప్పలేని పరిస్థితి. పటేళ్ల ఉద్యమాన్ని నీరుకార్చేందుకు వారి ప్రత్యర్థుల కుట్రలో భాగంగానే తాజా వీడియో అని విమర్శ కూడా వినిపిస్తోంది.