ప్రపంచాన్ని రెండేళ్లుగా గుప్పిట పట్టి ప్రాణాలు తీస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దీనికి సంకేతమా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) ఐరోపా విభాగం సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్19 మహమ్మారిని కొత్త దశకు తీసుకెళ్లిందని.. ఐరోపాలో ముగింపునకు చేరుకోవచ్చని డబ్ల్యూహెచ్.ఓ యూరప్ విభాగం డైరెక్టర్ హాన్స్ క్లూగే వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతంలో ఒక రకమైన ముగింపు దిశవైపు మహమ్మారి కదులుతున్నట్లు విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. మార్చి నాటికి ఐరోపాలో 60శాతం మంది ఒమిక్రాన్ బారినపడే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం ఐరోపా అంతటా ఉప్పెనలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గిన తర్వాత కొన్ని వారాలు, నెలల పాటు రోగనిరోధక శక్తి ఉంటుంది. వ్యాక్సిన్ లేదా ఇన్ ఫెక్షన్ కారణంగా ప్రజలు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. కాలానుగుణంగా కూడా ఇది తగ్గిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ 19 ఈ ఏడాది చివరి నాటికి మళ్లీ వ్యాప్తి చెందే ముందు నిశ్శబ్ద కాలం ఉంటుందని మేము అంచనావేస్తున్నాం. అయితే మహమ్మారి తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని యూరప్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా టాప్ సైంటిస్ట్ ఆంథోని ఫౌచీ కూడా ఆదివారం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వారం అమెరికాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని.. పరిస్థితులు కుదుటపడుతాయని ఫౌచీ అన్నారు.
అమెరికా ఈశాన్య ప్రాంతాలలో కేసుల సంఖ్య ఇటీవల తగ్గుదల కొనసాగితే దేశం అంతటా ఇలాగే ఉంటుందని నేను నమ్ముతున్నానని చెప్పారు.
అయితే ఒమిక్రాన్ కేసులు పెరిగినా వాటితో మరణాల సంఖ్య బాగా తక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. క్రమంగా కోవిడ్ 19 ఒక మహమ్మారి నుంచి సీజనల్ ఫ్లూ వంటి స్థానిక వ్యాధిగా మారడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని అంటున్నారు.