ఇద్దరూ రాజీనామాలు చేస్తే సరిపోతుందిగా ?

Update: 2022-03-09 06:32 GMT
'నువ్వు రాజీనామా చేసి గెలువు... అంటే కాదు నీకు దమ్ముంటే నువ్వే రాజీనామా చేసి మళ్ళీ గెలువు' అని ఒకరికి మరొకరు చాలెంజులు విసుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళద్దరు ఎవరయ్యా అంటే నగిరి ఎంఎల్ఏ ఆర్కే రోజా, టెక్కలి ఎంఎల్ఏ కింజరాపు అచ్చెన్నాయుడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్న ఒక సభలో చెప్పారు. తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పుకునే హక్కు అచ్చెన్నకుంది.

 ఇదే విషయాన్ని రోజా ప్రస్తావిస్తూ అచ్చెన్న చెప్పింది 160 సీట్లా ? లేకపోతే 160 ఓట్లా ? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చేది కల్లే అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇపుడున్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. రోజా చెప్పిందాంట్లో కూడా ఏమీ తప్పులేదు. ఎందుకంటే రోజా ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. అధికార పార్టీ ఎంఎల్ఏగా తన జోస్యం తాను చెప్పారంతే.

 దీనికి అచ్చెన్న స్పందించి ఎంఎల్ఏగా వెంటనే రాజీనామా చేసి మళ్ళీ నగరిలో రోజా గెలవాలని చాలెంజ్ చేశారు. రోజా గనుక మళ్ళీ  నగరిలో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో  నగరిలో   టీడీపీ పోటీ చేయదనే బంపరాఫర్ కూడా ఇచ్చారు.

దానికి రోజా ప్రతిస్పందిస్తూ తాను కచ్చితంగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తునే టెక్కలిలో అచ్చెన్న రాజీనామా చేసి గెలవాలని చాలెంజ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నకు గెలుపు అవకాశాలు లేవని కూడా చెప్పారు.

 నిజానికి వీరిద్దరు రాజీనామాలు చేసేది లేదని అందరికీ తెలుసు. అధికార పార్టీలో ఉండటం వల్ల రోజా రాజీనామా చేసినా మళ్ళీ గెలిచే అవకాశముంది. అదే అచ్చెన్న గనుక రాజీనామా చేస్తే గెలుపు అనుమానమే. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ మాత్రం దానికి పనికిమాలిన చాలెంజులు చేసుకోవాల్సిన అవసరమే లేదు.

ఏదో జనాలకు కాస్త వినోదం తప్ప ఒరిగేదేమీ ఉండదు. వీళ్ళద్దరిలో చిత్తశుద్ది ఉంటే ఇద్దరు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళితే అప్పుడు కాలమే నిర్ణయిస్తుంది గెలుపోటములను.
Tags:    

Similar News