చల్లని గాలిని ఎగజిమ్మే ‘ఏసీ’లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందా? గల్ఫ్ సహా వేడిగా ఉండే ఇండియా ఇతర దేశాల్లో ఆఫీసుల్లో కంపల్సరీగా ఏసీలుంటాయి. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఏసీలను వాడుతున్నారు. ఈ ఏసీలు లోపలి వేడిని బయటకు.. బయట గాలిని లోపలికి చల్లగా మార్చి పంప్ చేస్తుంటాయి. వీటి ద్వారా కరోనా వస్తుందనే ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజమెంత?
తాజా పరిశోధనలో రెస్టారెంట్స్ - హోటల్ - హాస్పిటల్స్ లో వాడే ఏసీలపై చేసిన అధ్యయనాల్లో తరచూ వెళ్లేవారికి కరోనా వైరస్ సోకుతుందని తేలింది. ఏసీలు బిగిస్తే మొత్తం గదిని మూసివేస్తారు. దీంతో ఎయిర్ కండీషనర్లు కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తాయని అమెరికా ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ లో ప్రచురించిన ఒక చైనా అధ్యయనం స్పష్టం చేసింది.
చైనా శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనలో పక్కపక్కనే కూర్చోవడం.. హోటళ్లలో కలిసి భోజనం చేయడం కరోనా వ్యాప్తికి కారణమవుతుందని తేలింది. గ్వాంగ్‌జౌలోని ఒక హోటల్‌లో 10 మందిపై జరిపిన అధ్యయనంలో ఇది నిర్ధారించబడింది. సంభాషణల సమయంలో విడుదలయ్యే లాలాజలం యొక్క తుంపరులు సాధారణంగా ఒక మీటర్ వరకు ప్రయాణిస్తాయని అధ్యయనం చూపించింది. కానీ, ఎయిర్ కండీషనర్ల గుండా వెళుతున్న గాలి దానిని చాలా దూరం వ్యాప్తి చేయడానికి సహాయపడుతుందని.. ఏసీల వల్ల కరోనా వ్యాపిస్తుందని తేలింది.
వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవడానికి హోటళ్లలో సీటింగ్ అమరికను మార్చాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచించింది. సీట్లు తక్కువగా ఉండాలని.. ఒకదానికొకటి దూరంగా ఉండాలి, అధ్యయనం సూచించింది.అయితే బిజినెస్ నే పరమావధిగా భావించే హోటళ్ళు దీన్ని అమలు చేస్తాయా అని వేచిచూడాలి.