మోడీని చూసి నేర్చుకుంటున్న జ‌గ‌న్‌.. కానీ, ఇబ్బందే గురూ!!

Update: 2022-09-21 15:30 GMT
కొన్ని కొన్ని విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. చిత్రంగా ఉంటుంది. రాష్ట్రంలో జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామ‌లు కూడా ఇలానే అనిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం.. ఏపీలో పెద్ద‌గా అభివృద్ధి లేదు. కేవ‌లం సంక్షేమం అమ‌లు చేస్తున్నామ‌ని.. త‌మ‌ది సంక్షేమ ప్ర‌భుత్వ మ‌ని.. వైసీపీ నాయ‌కులు.. స‌ర్కారు కూడా.. ప‌దే ప‌దే చెబుతున్నారు.  అంతకు మించి ఏమీ చేయ‌లేక పోతున్నారు. ఈ క్ర‌మంలో దీనిపై చ‌ర్చను ప‌క్క దారి ప‌ట్టించేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను వైసీపీ నేత‌లు వాడుకుంటున్నార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ.

ఇదిలావుంటే, ఉన్న ప‌థ‌కాలు.. సంస్థ‌ల‌కు పేరు మార్పు అనేది.. దీనిలో వ్యూహ‌మే చెబుతున్నారు ప‌రిశీ ల‌కులు. నిజానికి ఎన్టీఆర్ పేరుతో ఉన్న అన్న‌క్యాంటీన్ జోలికి .. వైసీపీ స‌ర్కారు పోవ‌డం లేదు. అస‌లు ఆ పేరు వినిపించ‌డానికి కూడా వీల్లేద‌ని.. ఇప్ప‌టికే పార్టీ పెద్ద‌లు.. మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో అన్న క్యాంటీన్ ఎక్క‌డా లేకుండా చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును మార్చేందుకు దుస్సాహ‌సం చేస్తున్నారు. అయితే.. ఇవ‌న్ని ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం కేంద్రంలో న‌రేంద్ర మోడీ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు.. స‌మాంత‌రంగా క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఎలాగంటే.. కేంద్రంలో న‌రేంద్ర మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక సంస్థ‌ల‌కు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇందిర‌, రాజీవ్‌గాంధీల పేర్ల‌ను మార్చేశారు. ఉదాహ‌ర‌ణ‌కు 'రాజీవ్ ఖేల్ ర‌త్న' పుర‌స్కారం కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న‌దే.

అయితే.. దీనిని మోడీ.. 'ధ్యాన్ చంద్ ఖేల్ ర‌త్న‌'గా మార్పు చేశారు. ఇక‌, రాజ్ ప‌థ్ వీధి పేరును క‌ర్త‌వ్య ప‌థ్‌గా మార్చేశారు. ఇందిరా గాంధీ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టును స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ ప‌టేల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర‌పోర్టుగా మార్చేందుకు తీర్మానం చేశారు.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన‌.. ప‌ద్మ అవార్డుల‌కు కూడా.. 'పీపుల్స్ ప‌ద్మ‌' పేరు పెట్టారు. ఇక‌, నెహ్రూ హ‌యాం నుంచి ఇందిర‌మ్మ స‌హా కాంగ్రెస్ పాల‌కుల వ‌రకు చేసిన‌.. పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక ప‌థ‌కాన్ని ఎత్తేశారు. దీని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకువ‌చ్చారు. ఇలా..అనేక మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు మోడీ మాదిరి గానే ఏపీలోనూ.. జ‌గ‌న్ ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా? అనే సందేహాలు.. వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. కేంద్రంలో మోడీకి చెల్లింద‌ని.. కానీ.. ఏపీలో అలా కుద‌ర‌ద‌ని అంటున్నారు.

ఇక్క‌డ భావోద్వే గంతో ముడిప‌డిన‌వ్య‌వ‌హారం కావ‌డంతో జ‌గ‌న్‌జిమ్మిక్కులు ఏకంగా.. ఆయ‌న‌కు ఇబ్బంది క‌రంగా మార‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అతి.. అన్ని స‌మ‌యాల్లోనూ ఫ‌లించ‌ద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News