టీడీపీ సోష‌ల్ మీడియాకు జ‌గ‌న్ భ‌య‌ప‌డ్డాడా?

Update: 2021-04-11 11:00 GMT
తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో విజ‌యం కాదు.. భారీ ఎత్తున మెజారిటీ సాధించాల‌నే ల‌క్ష్యం పెట్టు కున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఈ క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేల‌ను ప్ర‌చార ప‌ర్వంలోకి దింపి.. వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తికి 5 ల‌క్ష‌ల మెజారిటీ వ‌చ్చేలా కృషి చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. వెంట‌నే దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌రిమి లా.. వ‌చ్చిన ఉప ఎన్నిక నేప‌థ్యంలో భారీ ఎత్తున అదే స్థానిక ఫ‌లితం త‌మ‌కు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావించా రు.

అయితే.. రాజ‌కీయంగా తిరుప‌తిలో ప‌రిణామాలు మారుతున్న మాట వాస్త‌వం. టీడీపీ, జ‌న‌సేన‌-బీజేపీలు.. ప్ర‌చారాన్ని ఉదృతం చేశాయి. ఈ క్ర‌మంలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కినా.. మెజారిటీ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌చారం చేయాల‌ని భావించారు. దీనికి గాను ఈ నెల 14వ తేదీన ప‌ర్య‌టించేలా ముందుగా షెడ్యూల్ ఇచ్చారు. దీంతో తిరుప‌తిలోని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జ‌గ‌న్ కోసం స్వాగ‌త స‌త్కారాలు ఏర్పాటు చేశారు. అయితే.. ఇంత‌లోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌పై.. టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున చ‌ర్చలు చేప‌ట్టింది.

తిరుప‌తి ఉప ఎన్నిక విష‌యంలో వైసీపీకి భ‌యం ప‌ట్టుకుంద‌ని.. స్థానిక ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మాదిరిగా.. ఇక్క‌డ ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం లేద‌ని జ‌గ‌న్ గుర్తించార‌ని.. అందుకే ఆయ‌న ప్ర‌చారంలోకి స్వ‌యంగా దిగుతున్నార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌ను క‌న్ఫ్యూజ్‌కు గురిచేసేలా ప్ర‌య‌త్నించింది. వాస్త‌వానికి ఇవ‌న్నీ పెయిడ్ ఆర్టిక‌ల్సే అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ అధిష్టానం మాత్రం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు క‌నిపించింది. దీంతో వైసీపీ క‌రోనా నేప‌థ్యంలో తాము ప్ర‌చారం నుంచి వెన‌క్కి త‌గ్గుతున్నామంటూ.. సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు లేఖ‌రాశారు.

కరోనా ఉధృతి కారణంగా, ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభకు రాలేకపోతు న్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రచారం కన్నా తిరుపతి పార్లమెంటు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి తన బహిరంగ సభను రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అందరి కుటుంబాల ఆరోగ్యం దృష్ట్యా తాను రాలేకపోయినా, మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమందరి అభ్యర్థి, తన సోదరుడు డాక్టర్‌ గురుమూర్తిని గతంలో బల్లి దుర్గాప్రసాద్‌కు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ సుదీర్ఘ లేఖ రాశారు.

అంటే.. దాదాపు జ‌గ‌న్ ఇక‌, తిరుప‌తి ప్ర‌చారానికి వెళ్ల‌న‌ట్టే స్ప‌ష్ట‌మైంది. కానీ, దీనిని కూడా టీడీపీ అనుకూల సోష‌ల్ మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తోంది. దీంతో వైసీపీ కేడ‌ర్ ఇప్పుడు క‌న్ఫ్యూజ్‌లో ప‌డిపోయింది. `మేం ఎంతో పెద్ద ఎత్తున స్వాగ‌తం చెప్పాల‌ని అనుకున్నాం. స‌డ‌న్‌గా ఇప్పుడు ఇలా చేస్తే ఎలా?`` అని కేడ‌ర్ ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వైసీపీలో ఒక విధ‌మైన నైరాశ్యం ఏర్ప‌డింద‌ని అన‌డంలో సందేహం లేదు.



Tags:    

Similar News