తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వచ్చిన వార్త తమిళనాడు రాజకీయాల్లో కలకలం సృష్టించింది. జయలలిత సొంత అన్న జయకుమార్ కుమార్తె అయిన దీప తన భర్త మాధవన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను చెన్నై నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. తన భర్త మాధవన్‌తో ఏర్పడిన మనస్పర్థలపై ఆమె వాట్సాప్‌లో తీవ్ర పదజాలంతో మెసేజ్ పెట్టినట్టు చెబుతున్నారు.
మరోవైపు ఈ విషయమై దీప భర్త మాధవన్ మాట్లాడుతూ.. దీప తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నానని వెల్లడించారు. ఆమెను తానే ఆసుపత్రిలో చేర్పించానని చెప్పారు. మందులు అధికంగా వాడటం వల్ల దీప అస్వస్థతకు గురయ్యారని వివరించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. కాగా, జయలలిత మరణం తర్వాత దీపకు రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు దక్కాయి. ఆ తరువాతే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయని దీప సన్నిహితులు చెబుతున్నారు.
కాగా 2017లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మరణించాక ఆమె మేనకోడలు దీప తెరమీదకు వచ్చారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో పార్టీ ప్రారంభించారు. జయలలిత మరణంతో ఏర్పడ ఆర్‌కే నగర్ ఉప ఎన్నికలోనూ పోటీ చేయడానికి నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే అన్ని కాలమ్స్ పూర్తి చేయలేదని.. అఫిడవిట్ సమర్పించలేదని దీప నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.
గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 40 చోట్ల దీప పేరవై తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పిన దీప ఆ తర్వాత తన మద్దతును అన్నాడీఎంకేకి ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే ఎన్నికల్లో ఓడిపోయి డీఎంకే అధికారంలోకి వచ్చింది.
దీంతో అనారోగ్య కారణాలు, పెద్దగా మద్దతు లభించకపోవడం, ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు, వేధింపులు, మానసిక ప్రశాంతత కోసం తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని దీప తెలిపారు. కాగా గతంలో దీప జర్నలిస్టుగా పనిచేశారు. ఇంగ్లండ్‌లో ఎంఏ జర్నలిజం కోర్సు చదివారు. దీపకు ఒక సోదరుడు కూడా ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.