పవన్ ఇక్కడే పొరబాటు పడుతున్నారా ?

Update: 2022-07-16 06:38 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన తప్పులనే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. రోడ్ల దుస్ధితిపై తాజాగా జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సర్ అనే హ్యాష్ ట్యాగ్ తో మూడురోజుల డిజిటల్ నిరసన మొదలుపెట్టింది. శుక్రవారం ఉదయంతో మొదలైన నిరసనకు హ్యాష్ ట్యాగుల ద్వారా జనాలు అద్భుతంగా స్పందిస్తున్నారని పార్టీ ప్రకటించింది. మొదటి ట్వీట్ ను పవన్ పెట్టగానే వేలు, లక్షల మంది మద్దతుతెలిపినట్లు చెప్పింది. మొత్తంమీద పవన్ చేస్తున్న ట్విట్లు, పార్టీకి సుమారు 218 మిలియన్లు రెస్పాండయినట్లు చెప్పుకుంటోంది.

అంతాబాగానే ఉంది మరి తన నిరసనను పవన్ కేవలం డిజిటల్ ప్లాట్ ఫాం కు మాత్రమే పరిమితం చేయబోతున్నారా ? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే పోయిన ఏడాది రోడ్లపైన తెలిపిన నిరసనకు 1.7 కోట్లమంది జై కొట్టారట. తన ట్వీట్ కు స్పందిస్తున్న, మద్దతిస్తున్న జనాలను చూసి పవన్ తెగ సంతోషపడిపోతున్నారు.

అయితే ఇక్కడ పవన్ మరచిపోతున్న విషయం ఒకటుంది. అదేమిటంటే ఇంట్లో కూర్చుని ల్యాప్ టాప్, కంప్యూటర్ అదీ కాకపోతే మొబైల్ ఫోన్లో ట్విట్టర్ ను ఓపెన్ చేసి చాలామంది మద్దతు తెలుపటంలో ఆశ్చర్యం లేదు.

అదే ఇంట్లో నుండి బయటకు వచ్చి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి జనసేనకు ఓట్లేయమంటే మాత్రం వేయటం లేదు. ట్విట్టర్లో, ఫేస్ బుక్ లో మద్దతిచ్చిన వాళ్ళంతా కూడా కాదు అందులో కనీసం పదోవంతు కూడా పోలింగ్ బూత్ ల దగ్గర క్యూలైన్లలో నిలబడి ఓట్లు ఎందుకు వేయటంలేదు ?

ఎక్కడొస్తోంది తేడా అన్న విషయాన్ని పవన్ గమనించటం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫారాల్లోని పవన్ కు మద్దతు తెలుపుతున్న వారిలో అత్యధికులు సినిమా అభిమానులే అన్న విషయం వాస్తవం.

ఫేస్ బుక్ గ్రూపుల్లో చూస్తే పవన్ కు ప్రతిగ్రూపులోను లక్షలమంది సభ్యులుంటారు. వీళ్ళల్లో చాలామందికి ఓట్లుండవు. ఎందుకంటే వీళ్ళంతా పిల్ల పిలకాయలు. వీళ్ళే ఇపుడు రోడ్లపైన కూడా ట్విట్లు, లైకులు కొడుతున్నది. వీళ్ళని చూసుకుని మురిసిపోతే మళ్ళీ దెబ్బపడటం ఖాయం.
Tags:    

Similar News