రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ రాజకీయ, సినీ ప్రముఖులు కృష్ణంరాజు కుటుంబాన్ని.. ముఖ్యంగా ప్రభాస్‌ను పరామర్శించడానికి పెద్ద ఎత్తున వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రభాస్‌ను పరామర్శించడానికి వస్తున్న నేతల్లో బీజేపీ వారే అత్యధికులు ఉండటం గమనార్హం. ఇటీవల ఆ పార్టీ జాతీయ అగ్ర నేతలు సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, నితిన్‌లతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభాస్‌ను పరామర్శించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు.
అయితే బీజేపీ నేతల అసలు లక్ష్యం.. కృష్ణంరాజు మీద ప్రేమ కాదని ప్రభాస్‌ను రాజకీయంగా వినియోగించుకోవడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అతడి క్రేజు భీభత్సంగా పెరిగిపోయింది. ప్రపంచంలో వివిధ దేశాల్లోనూ వీరాభిమానులు ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ క్రేజును రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ వినియోగించుకోవాలని ఉద్దేశంతో బీజేపీ ఉందని చెబుతున్నారు.
ప్రభాస్ కుటుంబాన్ని బీజేపీ కుటుంబంగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చిపెడుతుందని బీజేపీ యోచనగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సొంత సోదరుడు ప్రబోధ్‌ను నర్సాపురం నుంచి ఎంపీగా బరిలోకి దించుతారని సమాచారం. గతంలో నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా కృష్ణంరాజు పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి ప్రభాస్ సోదరుడు ప్రబోధ్‌ను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని సమాచారం.
తద్వారా అఖిల భారత స్థాయిలో ప్రభాస్ ఇమేజ్‌ను ఉపయోగించుకోవడంతోపాటు ప్రభాస్ సొంత సామాజికవర్గమైన క్షత్రియుల్లోనూ ఇమేజ్ కొట్టేయొచ్చన్నదే బీజేపీ ప్లాన్ అని అంటున్నారు. క్షత్రియులు (రాజులు) కేవలం ఏపీ, తెలంగాణల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో అగ్ర కులంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను క్షత్రియుడిగా అందరికీ తెలిసేలా చేస్తే అది బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ప్రయోజనాన్ని చేకూర్చిపెడుతుందనే ప్లాన్‌లో ఆ పార్టీ ఉందని సమాచారం.
అయితే బీజేపీ ప్రతిపాదనకు ప్రభాస్ ఓకే చెప్తాడా?.. తన సోదరుడు ప్రబోధ్‌ను నర్సాపురం నుంచి బరిలోకి దించుతారా అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.