టీ వాదులు ఆమెను అంగీక‌రిస్తారా?

Update: 2015-09-03 18:06 GMT
ఉమ్మ‌డి రాష్ట్రంలో నియామ‌కం ఏదైనా స‌రే.. వారికి సంబంధించిన మూలాల్ని వెలికి తీసి.. ఈ మాత్రం తెలంగాణ వారు లేరా? ఫ‌లానా పోస్ట్ ని గ‌త అర‌వై ఏళ్ల‌లో తెలంగాణ వారికి ఎన్నిసార్లు ఇచ్చారు? ఆంధ్రోళ్ల‌కు ఎన్నిసార్లు ఇచ్చారు లాంటి చిట్టా తీసి మ‌రీ ప్ర‌శ్నించే ప‌రిస్థితి. రాష్ట్రం కానీ విడిపోతే.. ఇలాంటి లెక్క‌లు అవ‌స‌రం లేద‌ని.. అన్ని పోస్టుల్లోనూ తెలంగాణ‌వారే ఉండొచ్చ‌ని పేర్కొన‌టం తెలిసిందే.

మ‌రి.. ఈ విష‌యం ఎంత‌గా పెద్ద‌దై.. చివ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రం ముక్క‌లు అయ్యే ప‌రిస్థితి. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర స్వ‌చ్ఛ‌భార‌త్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌ముఖ సినీన‌టుడు మోహ‌న్‌బాబు కుమార్తె.. సినీన‌టి.. మంచు ల‌క్ష్మిని ఎంపిక చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికార బాధ్య‌త‌ల్ని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్రప‌తి చేతుల మీదుగా ఈ నెల 10న బాధ్య‌తులు తీసుకోనున్నారు.

సీమాంధ్ర మూలాలు ఉన్న మంచుల‌క్ష్మి నియామ‌కం ప‌ట్ల తెలంగాణ‌వాదుల స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పొచ్చు. తెలంగాణలో పుట్టి పెరిగిన కిర‌ణ్ కుమార్ రెడ్డి లాంటి వ్య‌క్తినే సీమాంధ్ర బ్రాండ్ వేసేసిన తెలంగాణ అధికార‌ప‌క్షం నేత‌లు.. తాజా నియామ‌కం ప‌ట్ల ఎలాంటి స్పందిస్తార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఓప‌క్క కేంద్రంలో అంటీముట్ట‌న‌ట్లుగా ఉన్న స‌మ‌యంలోనే.. మంచుల‌క్ష్మిని తెలంగాణ స్వ‌చ్ఛ‌భార‌త్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం.. తెలంగాణ స‌ర్కారుకు అసంతృప్తికి గురి చేసే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. ఈ విష‌యంలో మ‌రో మాట కూడా వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ క‌విత‌కు మంచు ల‌క్ష్మి సన్నిహితురాల‌ని..కాబ‌ట్టి.. ఆమె నియామ‌కంపై ఎలాంటి ప‌ట్టింపులు ఉండ‌వ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. న‌చ్చినోళ్ల‌కు ప‌ద‌వులు వ‌స్తే.. ఇప్ప‌టివ‌ర‌కూ వినిపించిన ప‌ట్టింపులు ఉంటాయో ఉండ‌వో రానున్న రోజుల్లో తేలిపోవ‌టం ఖాయం.
Tags:    

Similar News