హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం విషయంలో కేసీఆర్ మరీ ఇంతగా భయపడుతున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలు మంజూరై పోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదలైపోయి పనులు మొదలైపోయాయి. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బండ శ్రీనివాసరావును నియమించారు.
టీఆర్ఎస్ అభ్యర్దిగా గెల్లు శ్రీనివాసయాదవ్ ను ఎంపిక చేశారు. ఇక కాంగ్రెస్ లో నుండి వచ్చి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే ఎంఎల్సీగా ప్రతిపాదించారు. ఇవన్నీ సరిపోవన్నట్లు దళిత బంధు పథకాన్ని ప్రకటించి నియోజకవర్గంలో లబ్ధిదారుల కోసం ఇప్పటికే సుమారు రు. 1200 కోట్లు విడుదల చేశారు. ఇది కూడా సరిపోదన్నట్లుగా నియోజకవర్గానికి చెందిన బీసీ నేత వకుళాభరణం కృష్ణమోహన్ రావును బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించారు.
గడచిన ఏడేళ్ళలో ఎప్పుడూ లేనట్లుగా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మీదే కేసీయార్ ఎందుకింతగా దృష్టి పెట్టారు ? ఎందుకంటే ఉపఎన్నికల్లో విజయం మీద బహుశా గ్యారెంటీ లేదేమో అని జనాల్లో చర్చ పెరిగిపోతోంది. నియోజకవర్గం మీద కేసీయార్ దృష్టిపెట్టిన కొద్దీ జనాల్లో పార్టీ గెలుపుపై నెగిటవ్ చర్చ పెరిగిపోతోందట. ఎంఎల్ఏగా ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతోనే నియోజకవర్గానికి మహర్దశ వచ్చినట్లయ్యిందని జనాలు చర్చంచుకుంటున్నారు.
ఈటల గనుక ఎంఎల్ఏగా రాజీనామా చేయకుంటే నియోజకవర్గాన్ని కేసీయార్ అసలు పట్టించుకునేవారేనా ? అనే డౌటు అందరిలోను పెరిగిపోతోంది. ఎవరైనా గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతారు. కానీ ఇక్కడ వ్యవహారమంతా రివర్సులో నడుస్తోంది. ఈటల రాజీనామా చేయబట్టే నియోజకవర్గం డెవలప్ అవుతోంది. ఇది చాలు ఈటలపై గెలుపు విషయంలో కేసీయార్ ఎంతగా భయపడుతున్నారో మాట్లాడుకోవటానికి