టీడీపీలో ఐక్యత లేదు. పార్టీ అధినేతగా చంద్రబాబు చెప్పే సూచనలను ఎవరూ పాటించడం లేదు. ఈ మాట ఎవరో చెప్పాల్సిన అవసరం.. ప్రత్యర్థులు ఆరోపించాల్సిన అవసరం లేదు. దీనిని తరచుగా.. చంద్రబాబే చెబుతున్నారు. తన మాటను ఎవరూ లెక్కచేయడం లేదని.. ఆయన అంటున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది..? దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని మాటను పార్టీ నాయకులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
దీనికి సమాధానం.. చంద్రబాబే అంటున్నారు.. గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు.. పైగా చంద్రబాబు రైట్ హ్యాండ్ గా ఉన్న నేతలు. ఎందుకంటే.. ఏ పార్టీలోఅయినా.. కోర్ కమిటీలు.. పొలిట్ బ్యూరో.. కమిటీలు.. ఉంటాయి. అందులో సభ్యత్వం ఉన్నవారు అంటే.. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నవారి కిందకే వస్తారు. వారు కూడా తమ సూచనలను పాటించాలని.. పోనీ.. కనీసం.. అధినేత వినాలని కోరుకుంటారు. పాటించకపోయినా.. వింటే.. సదరునాయకులు ఎంతో కొంత సంతృప్తి వ్యక్తం చేస్తారు.
ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్నదే. వైసీపీనే తీసుకుంటే... దీనిలోనూ కోర్ కమిటీ ఉంది. పొలిట్ బ్యూరో కమిటీ కూడా ఉంది. వీరంతా కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో నివేదికలను ఏటా పార్టీ అధినేత జగన్‌కు సమర్పిస్తారు. అంతేకాదు.. కొన్ని సూచనలు కూడా చేస్తారు.
వాటిని ఆయన సమగ్రంగా తెలుసుకుంటా రు. ఇలా .. చేసిందే.. నవరత్నాల్లో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం.. జంగా కృష్ణమూర్తి చెప్పిన దానికి జగన్ మార్కులు వేయడం. తద్వారా.. పార్టీలో అందరూ...సమానమనే సంకేతాలు పంపించారు.
కానీ, ఈ తరహా పరిస్థితి టీడీపీలో లేదని.. చంద్రబాబు ఎవరి మాటా వినరనేది మాజీ నాయకుల మాట. అందుకే పార్టీలో ఎక్కడికక్కడ గ్రూపులు వచ్చాయని.. పార్టీ అధినేత మూస విధానాన్ని నేటి తరం వ్యతిరేకిస్తోందని.. మాజీల అభిప్రాయం.
ఈ క్రమంలోనే చాలా మంది నాయకులు అచేతనంగా ఉండిపోయారని కూడా అంటున్నారు. మేం చెప్పినప్పటికీ..చంద్రబాబు వినరు. ఆయన చెప్పిందే చేయాలని అంటారు.. అనే మాట పార్టీలో స్థిరపడిపోయింది. అందుకే పార్టీ ఇబ్బందుల్లో ఉందనేది సీనియర్ల మాట. మరి చంద్రబాబు ఇప్పటికైనా.. తన పంథాను మార్చుకుంటారో లేదో చూడాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.