టీడీపీ ఎమ్మెల్సీ కుమారుడు మృతి... పరామర్శించిన చిరంజీవి!
విష్ణు స్వరూప్ మరణవార్త తెలిసిన అనంతరం సినీ నటుడు చిరంజీవి స్పందించారు. రామచంద్రయ్య నివాసానికి వెళ్లారు.
టీడీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందులో భాగంగా.. రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్ గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు రాగా.. హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో రామచంద్రయ్య కుటుంబాన్ని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు.
అవును... టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఆయన కుమారుడూ విష్ణు స్వరూప్ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. విష్ణు స్వరూప్ మరణవార్త తెలిసిన అనంతరం సినీ నటుడు చిరంజీవి స్పందించారు. రామచంద్రయ్య నివాసానికి వెళ్లారు.
అనంతరం.. విష్ణుస్వరూప్ భౌతికకాయానికి నివాళులర్పించిన చిరంజీవి.. రామచంద్రయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా... చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీలో రామచంద్రయ్య కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందూ వైసీపీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీలో చేరారు.
ఏపీ సీఎం దిగ్భ్రాంతి, డిప్యుటీ సీఎం ప్రగాఢ సానుభూతి!:
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య తనకుడు విష్ణుస్వరూప్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విష్ణు స్వరూప్ ఇలా గుండెపోటుతో మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న రామచంద్రయ్య కుటుంబానికి దేవుడు మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరారు.
ఇదే సమయంలో... శాసన మండలి సభ్యులు రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ ఆకస్మిక మృతి దురదృష్టకరమని చెప్పిన పవన్ కల్యాణ్.. విష్ణు స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామచంద్రయ్యకు మానో ధైర్యాన్ని భగవంతుడు అందించాలని అన్నారు. ఆయన కుటుంబానికి పవన్.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు!