పంజాబ్ లో అన్ని పార్టీలు మాల్వా ప్రాంతంపైనే కన్నేశాయి. అయితే మాల్వాతో పాటు దొవాబాపైన కూడా కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే దొవాబా ప్రాంతంలోనే అత్యధికంగా దళితుల సీట్లున్నాయి కాబట్టే. ఈ ప్రాంతంలో ఏకంగా 23 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. అందుకనే ఇక్కడ మొత్తం సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ చాలా కష్టపడుతోంది. ఇందులో భాగంగానే దళితుడైన చరణ్ జీత్ సింగ్ చన్నీని వ్యూహాత్మకంగా సీఎంను చేసింది.
చన్నీ కూడా దొవాబా ప్రాంతానికి చెందిన నేతే. కాబట్టి సహజంగానే చన్నీకి మంచి పట్టుంది. పోయిన ఎన్నికల్లో ఇక్కడి 23 సీట్లలో కాంగ్రెస్ 15 సీట్లలో గెలిచింది. అధికారంలోకి వచ్చేస్తుందనే ప్రచారం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండు స్ధానాల్లో విజయం సాధించింది. అప్పుడు గెలిచిన 15 సీట్లకు మించిన స్ధానాల్లో గెలవాలని కాంగ్రెస్ మంచి పట్టుదలతో ఉంది. మరి ఆప్ ఏమి చేయబోతోందనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్రంలోని దళుతుల నియోజకవర్గాలు ఇంకా ఉన్నప్పటికి దొవాబాలో మాత్రం ఒకేచోట కేంద్రీకృతమయ్యున్నాయి. దీంతో అన్ని పార్టీలు దళితుల ఓట్లను కొల్లగొట్టేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, చన్నీ, సిద్ధూ, అకాలీదళ్ అగ్రనేత హరిసిమ్రత్ కౌర్ లాంటి వాళ్ళు పదే పదే దొవాబా ప్రాంతంలోనే తిరిగారంటేనే ఈ ప్రాంతానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమైపోతోంది.
పోలింగ్ ముందు కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం ఏమిటంటే ముఖ్యమంత్రి చన్నీ, పీసీపీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ ఒకటైపోవటమే. ఎన్నికల షెడ్యూల్ కు ముందు వరకు ఇద్దరి మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుండేది. అలాంటిది టికెట్ల కేటాయింపు, ప్రచారాన్ని కలిసే చేయటం, అధిష్టానం కూడా చన్నీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం, దానికి సిద్ధూ మద్దతివ్వడం పార్టీకి బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
ఈ విషయాలన్నీ బాగా గమనించిన కారణంగానే మొదట్లో బీజేపీ అధికారంపై ఆశలు వదిలేసుకుంది. అయితే తెరవెనుక ఏమైందో ఏమో హఠాత్తుగా పంజాబ్ లో లక్షలాది మంది భక్తులున్న డేరా బాబా బెయిల్ పై బయటకు వచ్చారు.
డేరా బాబా బెయిల్ పై బయటకు రావటం వెనుక బీజేపీనే ఉందనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ఎన్నికలకు ముందు బయటకు వచ్చిన బాబా ఏమి చేస్తారో చూడాలి. అలాగే జనాలు ఏ పార్టీని ఆదరిస్తారనేది ఆసక్తిగా మారిపోతోంది.