ఓపెన్​ హార్ట్​ సర్జరీకి ప్రత్యామ్నాయం వచ్చేసింది?

Update: 2021-03-24 04:30 GMT
ఇటీవల కాలంలో ఓపెన్​ హార్ట్ సర్జరీలు కామన్ ​గా మారిపోయాయి. చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో కొందరికి ఓపెన్​ హార్ట్​ సర్జరీ తప్పనిసరి అవుతున్నది. అసలు ఈ ఓపెన్​ హార్ట్ సర్జరీ ఎందుకు చేయవలసి వస్తుందో ఓసారి తెలుసుకుందాం. ముఖ్యంగా గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు ఈ సర్జరీని చేస్తుంటారు. 30 శాతం పూడికలు ఏర్పడితే మందులు, జీవనశైలిమార్పుతో తగ్గించుకోవచ్చు. అయితే 70 శాతం లేదా 100 శాతం పూడికలు ఏర్పడితే మాత్రం సర్జరీ తప్పనిసరి. అయితే ఓపెన్​ హార్ట్​ సర్జరీ స్థానంలో ఇప్పుడో కొత్త వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చింది. అదే యాంజిబోప్లాస్టీ. సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్సా విధానంతో గుండె రక్తనాళాల్లో ఏర్పడ్డ పూడికలు తొలగించుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు.

ఏమిటీ యాంజియోప్లాస్టీ..

రక్తనాళాల్లో పూడికలు వస్తే మామూలుగా యాంజిగ్రామ్​ చేసి, స్టెంట్స్​ వేస్తున్నారు. ఈ పద్ధతిలో సాధారణంగా రక్తనాళాల్లోకి తీగను పంపించి .. రక్తనాళాలను కొద్దిగా విస్తీర్ణం చేసి.. ఆప్లేస్ ​లో స్టెంట్​ వేస్తుంటారు. అయితే తాజాగా సీటీవో అనే విధానం అమల్లోకి వచ్చింది. అయితే క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌ యాంజియోప్లాస్టీలో పూడిక ఎంత గట్టిగా మారినా, దాన్ని వేర్వేరు నైపుణ్యాలతో తొలగించే పరికరాలను చికిత్స సమయంలో వాడుకునే వీలుంటుంది.

పూడిక తొలగించి, స్టెంట్స్‌ కూడా వేసే వెసులుబాటు ఉంటుంది.

ఒకవేళ రక్తనాళం 100 శాతం పూడిపోతే దాన్ని సాధారణ యాంజియోప్లాస్టీలో సరి చేయలేము. అప్పుడే క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌ చికిత్సా విధానంలో యాంటీగ్రేడ్‌, రిట్రోగ్రేడ్‌ అనే రెండు టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. సాధారణ సర్జరీ అంటే సీటీవో విధానం ఎంతో మెరుగైందని వైద్యులు అంటున్నారు. సర్జరీ వల్ల ఎక్కువ రోజులు రెస్ట్​ తీసుకోవల్సి ఉంటుంది. అంతేకాక చుట్టూ ఉన్న కణజాలం కూడా దెబ్బతింటుంది. కానీ ఈ సీటీవో విధానం వల్ల అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు.




Tags:    

Similar News