పెళ్లి సందడి, వినోదం, శుభాకాంక్షలు తదితర చిత్రాల సూపర్ హిట్లతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. సీనియర్ హీరోయిన్ రవళి. ప్రముఖ టీవీ నటి హరిత చెల్లెలు అయిన రవళి తెలుగు చిత్రాల్లోనే కాకుండా పలు తమిళ, మలయాళం చిత్రాల్లోనూ నటించింది. రవళి తమ్ముడు కూడా చిరంజీవి మాస్టర్ సినిమాలో స్టూడెంట్స్ లో మెయిన్ విలన్ పాత్ర పోషించాడు.
కాగా కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన రవళి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రవళి.. మరో సినీ నటి, ప్రస్తుతం జగన్ కేబినెట్ లో పర్యాట శాఖ మంత్రి ఆర్కే రోజా వెంట దర్శనమిచ్చింది. దీంతో ఆ భామ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనుందని గాసిప్ రాయుళ్లు ప్రచారం చేస్తున్నారు.
అందులోనూ రవళి కాపు సామాజికవర్గానికి చెందినవారని చెబుతున్నారు. జనసేన జోరుకు అడ్డుకట్ట వేయడానికి, తనకు ఏకుకు మేకులా మారుతున్న పవన్ కల్యాణ్ ను దెబ్బకొట్టడానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ కాపు నేతలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించారని.. ఈ నేపథ్యంలో రోజా ద్వారా రవళిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందులోనూ రోజా, రవళి ఒకే సమయంలో హీరోయిన్లుగా రాణించారు. ఇద్దరూ తెలుగు అమ్మాయిలే. దీంతో సహజంగానే వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో జూలై 14న తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. ఆమెతోపాటు అక్కడ రవళి కూడా కనిపించడం గమనార్హం. వీరిద్దరూ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో పలు రకాల ప్రచారానికి తెరలేచింది. ఇప్పటికే వైఎస్సార్సీపీలో సినీ రంగం నుంచి పోసాని కృష్ణమురళి, అలీ, విజయ్ చందర్ వంటివారు ఉన్నారు. ఇప్పుడు నటీమణులపై దృష్టి సారించారని అంటున్నారు.
రోజా, రవళి ఇద్దరూ మంచి స్నేహితురాళ్లు. దీంతో రవళిని వైఎస్సార్సీపీ వైపు రోజా నడిపిస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. అలాగే ఇటీవల టీడీపీపై ఘాటు విమర్శలు చేసి బయటకొచ్చిన దివ్య వాణి కూడా వైఎస్సార్సీపీలో చేరుతుందని సమాచారం. కాగా రవళి సోదరి హరిత, ఆమె భర్త జాకీ గతంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో రవళి పార్టీలో చేరతారా? లేదంటే అనుకోకుండా తిరుమలలో రోజాను కలిశారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.