కేవలం పది రోజుల్లో పరిస్థితులు ఎంతలా మారిపోయాయి. గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు కాస్త ముందు ఎల్ బీ స్టేడియం వేదికగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం. గతంలో మాదిరి ఆయన మాటల్లో పస లేకున్నా.. తన మార్క్ అయిన ఘాటు వ్యాఖ్యలతో కొంతమేర ఆకర్షించేప్రయత్నం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు ధీమాను ప్రదర్శించిన ఆయన.. సదరు ఎన్నికలు అయిన వెంటనే ప్రాంతీయ పార్టీల్ని ఒక జట్టుగాచేసి.. జాతీయ స్థాయిలో కూటమి కడతానని బీరాలు పలికారు. కేంద్రంలోని దుర్మార్గ సర్కారును దుయ్యబట్టారు.
ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వచ్చిన రెండో రోజే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ ను తెలంగాణ సర్కారు అధికారికంగా నిర్వహించిన వైనం చర్చనీయాంశంగా మారింది. బంద్ లు.. నిరసనలు.. ధర్నాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని కేసీఆర్.. అందుకు భిన్నంగా తనకు నచ్చితే బంద్ ల్ని ఎలా నిర్వహిస్తారో చేతల్లో చేసి చూపించారు. ఇది జరిగిన రెండురోజులకు అనూహ్యంగా ప్రధాని మోడీని పొగుడుతూ లేఖ రాయటమే కాదు.. ఆ వెంటనే ఢిల్లీ టూర్ పేరుతో మూడు రోజులు మకాం వేయటం ఆసక్తికరంగా మారింది.
ఇంతకూ ఆయన ఢిల్లీ టూర్ వెనుక అసలు లెక్క ఏమిటి? ఏ కారణంతో ఆయన అంత హడావుడిగా హస్తినకు పరుగులు తీశారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ టూర్ కు కాస్త ముందు.. ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యను మర్చిపోకూడదు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని.. కోర్టును ఆశ్రయించి విచారణ చేయిస్తామని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. ప్రభుత్వం కూలిపోతుందని కూడా పేర్కొని సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలతోపాటు.. మరికొన్ని కీలక అంశాలు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు కారణమైందని చెబుతన్నారు. అందులో ప్రధానమైనది.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కొంతమంది అభ్యర్థుల ఖాతాల్లోకి ఒక కాంట్రాక్టర్ నుంచి నేరుగా రూ.కోటి చొప్పున వెళ్లిన వైనానికి సంబంధించిన సమాచారం కేంద్రంలోని విచారణ సంస్థలకు ఉప్పందినట్లుగా చెబుతున్నారు.
దీనికి మించి.. ఈ మధ్యన బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ కు కేసీఆర్ ఆర్థిక సాయం అందించారన్న సమాచారం కూడా ఆధారాలతో కేంద్రానికి చేరినట్లు చెబుతున్నారు. ఈ రెండు అంశాలపై సీరియస్ గా ఉన్న కేంద్రాన్ని.. తనదైన శైలిలో ప్రసన్నం చేసుకునేందుకే కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.