అడ్డంగా దొరికిన చైనా..క‌రోనా విష‌యంలో కీల‌క నివేదిక బ‌హిర్గ‌తం

Update: 2020-04-27 14:30 GMT
క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డానికి చైనా కార‌ణ‌మ‌ని, ఆ దేశం ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆ వైర‌స్‌ ను బాహ్య ప్ర‌పంచంలోకి తీసుకొచ్చింద‌ని అమెరికా - ఆస్ట్రేలియాతో పాటు చాలా దేశాలు ప్ర‌ధానంగా ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల‌‌ను చైనా ఖండిస్తోంది. ఈ విష‌యంపై ప్ర‌పంచ దేశాలు - చైనా మ‌ధ్య విమ‌ర్శ‌లు - ప్ర‌తివిమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. దీనిపై చాలా దేశాలు అధ్య‌య‌నం చేస్తున్నాయి. ఆ వైర‌స్ వ్యాప్తిపై విస్తృతంగా శోధిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రపంచ దేశాలకు ఓ ఆధారం లభించింది. క‌రోనా వైర‌స్ మనుషుల్లో సంక్రమిస్తోందనే విష‌యాన్ని చాలా రోజుల తర్వాత ప్ర‌క‌టించింద‌ని తేలింది. ఎప్పుడో వ్యాపిస్తే తాపీగా జనవరి 20వ తేదీన చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్ ఆ వైర‌స్‌ పై ప్రకటించారని వెల్ల‌డైంది. అయితే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మరుసటి రోజు ఓ కీలక నిర్ణ‌యం చైనా తీసుకుంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆ దేశం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా యాంటీ వైరల్‌ ఔషధం రెమ్‌ డెసివిర్‌ ను వాణిజ్య తరహాలో ఉత్పత్తి చేసుకునే పేటెంట్‌ కోసం జనవరి 21వ తేదీన దరఖాస్తు చేసుకుంది. ఈ విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఆ దరఖాస్తు చేసుకున్న సంస్థ వూహాన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌. ఈ ల్యాబ్ నుంచే క‌రోనా వైర‌స్ లీకయిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ ప‌త్రం బ‌హిర్గ‌త‌మైంది.

కరోనా.. సాంక్రమిక వ్యాధి అనే విషయం తెలిసిన 6 రోజుల అనంత‌రం ఆ సమాచారం తెలియ‌కుండా జాగ్ర‌త్తప‌డింది. ఆ స‌మాచారం ‌ప్రజలకు తెలియ‌కుండా చైనా ప్రభుత్వం అడ్డుకుంద‌ని - వాస్తవాలను వ్యాప్తి చేయకుండా సోషల్‌ మీడియా సైట్లను స్ర్కీనింగ్‌ చేయడంతో పాటు ప్రభుత్వ వైద్యారోగ్య విభాగాల దర్యాప్తులను నిలిపివేసిందని ఆ ప‌త్రంలో తేలింది. ఈ క్ర‌మంలోనే చైనా పేటెంట్‌ కు దరఖాస్తు చేసుకున్న రెమ్‌డెసివిర్ ఔషధం విష‌యం అంద‌రికీ ఆస‌క్తిగా మారింది.

అయితే ఆ ఔష‌ధం ఎబోలా వైరస్‌ కట్టడి కోసం అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే గిలీడ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసింది. ఈ ఔష‌ధం వైర‌స్‌లోని డీఎన్‌ ఏ - ఆర్‌ ఎన్‌ ఏలలో ఉండే నాలుగు బిల్డింగ్‌ బ్లాక్‌ లలో ఒక దానిని అనుకరించి, దాని జన్యువుల్లో కలిసిపోతుంది. దీంతో వైరస్‌ రూపాంతరాన్ని నిలువరిస్తుందని స‌మాచారం. ఎబోలా వైరస్‌ పై పనిచేసినట్టే కరోనా వైర‌స్‌ పై రెమ్‌ డెసివిర్‌ పని చేస్తుందని చైనా భావించింది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా చైనా ఆ ఔష‌ధంపై ముందే అనుమ‌తి పొందింద‌ని తేలింది. క‌రోనాకు వ్యాక్సిన్ కనుకుంటేనే - వ్యాక్సిన్‌ తయారీకి ప్రయోగాలు చేస్తూనే రెమ్‌ డెసివిర్‌ పై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపిన‌ట్లు ఆ ప‌త్రంలో ఉంది. అయితే రెమ్‌ డెసివ‌ర్ ఔషధం కరోనా రోగులపై ప్రభావవంతంగా పని చేయడం లేదని చైనా గుర్తించింది. ఈ క్ర‌మంలో దాని వివరాలతో కూడిన ఓ నివేదిక డబ్ల్యూహెచ్ ఓ తన‌ వెబ్‌ సైట్‌ లో ప్రచురించింది. ఆ నివేదిక‌ను గ‌మ‌నించిన రెమ్‌ డెసివిర్ ఉత్ప‌త్తి చేసిన సంస్థ గిలీడ్‌ సైన్సెస్ ఆ నివేదిక త‌ప్ప‌ని తేల్చింది. తగిన సంఖ్యలో వలంటీర్లు లేకుండా ప్రయోగ పరీక్షలు నిర్వహించి తప్పుడు సమాచారం ఇచ్చార‌ని తెలిపింది. వైరస్‌ తొలిదశలో ఉన్న రోగులపై తమ ఔషధం బాగానే పని చేస్తోందని గిలీడ్‌ సైన్సెస్ స్ప‌ష్టం చేసింది. దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్ ఓ వెంటనే తమ వెబ్‌ సైట్‌ లో ఉంచిన ఆ నివేదికను తొలగించింది.

ఈ ప‌రిణామాన్ని ప‌రిశీలిస్తుంటే చైనాకు ముందే క‌రోనా వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తుంద‌ని తెలుసు. ముందు ఆ దేశం జాగ్ర‌త్త‌ప‌డి ఆ వైర‌స్‌ కు మందు అందుబాటులో ఉంచిన త‌ర్వాత ప్ర‌పంచానికి చైనా క‌రోనా వైర‌స్‌ పై ప్ర‌క‌ట‌న వెలువ‌రించింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఉద్దేశ‌పూర్వ‌కంగానే చైనా క‌రోనా వైర‌స్‌ పై త‌ప్పుడు స‌మాచారం అందించింద‌ని ప్ర‌పంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చైనా చేసిన త‌ప్పున‌కు ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డింద‌ని అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు, అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పాటు ప్ర‌పంచ దేశాలు ఖండిస్తున్నాయి.


Tags:    

Similar News