తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా సరైన మద్దతు కనిపించడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎంతో భరోసాగా ఉంటూ దేశవ్యాప్తంగా తన సన్నిహిత నేతలను ఢిల్లీలో జరిగే బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి పిలిచారు. అందరినీ కలుపుకొని పోవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన వచ్చే మూడు నాలుగు నెలల్లోనే దేశవ్యాప్తంగా చుట్టేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ జాతీయ భవనాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. అయితే ఇక్కడ ఆదిలో అనుకున్నంత ఈజీగా పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కు పోటీగా ఇద్దరు నాయకులు కేంద్రంలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తమను టార్గెట్ చేస్తాడని భావించిన బీజేపీ.. వెంటనే వ్యూహం మార్చేసినట్టు తెలుస్తోంది. తమకు ప్రత్యర్థిగా మారిన కేసీఆర్ కు మరో నేతలను తయారు చేసే పనిలో పడింది.కేసీఆర్ ఎలాగూ లొంగరని భావించి బీజేపీ పక్కా వ్యూహాన్ని మార్చుతూ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ తమకు ఎలాగూ దెబ్బ వేస్తాడని అనుకుంటున్న బీజేపీ ఇతర జాతీయ నేతలను రంగంలోకి దింపుతోందని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రారంభోత్సవం చూస్తుంటే అదే అనిపిస్తోంది.
బీహార్ సీఎం నితీష్ కుమార్.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. వాస్తవానికి నిన్నా మొన్నటివరకూ కేసీఆర్ తో కలిసి మోడీపైపోరు చేస్తానని చెప్పిన నితీష్ ఈరోజు బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. అయితే కేసీఆరే ఆహ్వానించలేదనే టాక్ వినిపిస్తోంది. నితీష్ మిత్రపక్షం ఆర్జేడీ డిప్యూటీ సీఎం తేజస్విని మాత్రం ఆహ్వానించారని తెలుస్తోంది.
బెంగాల్ సీఎం మమత కూడా కేసీఆర్ తో కలిసి ముందుకు సాగాలనుకున్నా.. ఆమె కూడా ఇప్పుడు నితీష్ వైపు చూస్తున్నారని సమచారం. బీఆర్ఎస్ భవన ప్రారంభోత్సవానికి మమతను కూడా ఆహ్వానించనట్లు తెలుస్తోంది.
జార్ఖండ్ సీఎం హేమంత్, బెంగాల్ సీఎం మమతలు నితీష్ కే మద్దతుగా ఉన్నారని.. బీజేపీకి ప్రత్యామ్మాయంగా జోడీ కడితే నితీష్ కీలకమవుతాడని తెలుస్తోంది. కేసీఆర్ ను దెబ్బతీయాలంటే ప్రత్యామ్మాయంగా నితీష్ ను లేపడం కరెక్ట్ అని బీజేపీ రాజకీయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ఢిల్లీలోనే జరిగిన కేసీఆర్ 'బీఆర్ఎస్' ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ఆయన సొంతంగానే జాతీయ స్థఆయిలో ఎదగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ తో కలిసి వస్తారనుకున్న వివిధ పార్టీల నేతలంతా బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి రాకపోవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఒంటరి అయ్యారని.. కేవలం అఖిలేష్ యాదవ్, జేడీఎస్ కుమారస్వామి తప్పితే వేరే నేతలే లేరని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.