మనిషి అనే మాటకు సంబంధించి ఏ రకంగా చూసినా అర్హత లేని వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? అంటే ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులే. మనుషుల రూపంలో ఉన్న రాక్షసులుగా వారిని చెప్పొచ్చు.
మతమౌఢ్యాన్ని తలకెక్కించుకొని వారు పాల్పడే దారుణచర్యలు ప్రపంచం మొత్తాన్ని భీతిల్లిపోయేలా చేస్తున్నాయి. వారి చేష్టలే కాదు.. వారి మాటలు కూడా ఎంత ఛండాలంగా.. అమానుషంగా ఉంటాయనటానికి తాజా ఉదంతమే ఒక నిదర్శనం. ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులకు చెందిన దఖీఖ్ అనే మ్యాగ్‌జైన్‌లో ఒక వ్యాసాన్ని ప్రచురించారు.
స్లేవ్ గాళ్స్ ఆర్ ప్రాస్టిట్యూట్స్ అన్న శీర్షిక మీద విపరీతమైన విషాన్ని చిమ్మిన ఈ వ్యాసంలో ప్రపంచ పెద్దన్న అమెరికా అధినేత సతీమణిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మిషెల్ ఒబామాను ఒక వేశ్యగా అభివర్ణించటంతోపాటు.. యాజిది మహిళలను చెరపట్టటాన్ని సమర్థించుకున్నారు.
అంతేకాదు.. ఒబామా భార్య దినార్‌లో మూడోవంతుకు మించిన విలువ చేయదని.. అసలు దినార్‌లో మూడో వంతు కూడా ఆమె కంటే ఎక్కువేనని తమ మనసులోని విషాన్ని కక్కారు. అంతేకాదు.. మాజిది యువతులను సెక్స్ బానిసలుగా చేసుకోవటం ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు.
అసలు మీ దేవుడెవరు? మీ మతం ఏమిటి? ఇది తప్పని ఎలా చెబుతారంటూ వ్యాఖ్యానించారు. ఈ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఈ రాక్షసులు మర్చిపోతున్న విషయం ఒకటుంది. ఇస్లాం పుట్టటానికి ముందు ప్రపంచం ఉంది. మనుసులు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇస్లాం మాత్రమే ఒక మతంగా ఎలా భావించాలి? ఇప్పుడు ఇస్లాంలో ఉన్న వారంతా ఆ మతం పుట్టటానికి ముందు ఏ మతం వారు అని అడిగితే ఎలా ఉంటుంది? మతం పేరు చెప్పుకొని.. మానవత్వం మర్చిపోయి దారుణంగా వ్యాఖ్యలు చేయటం ద్వారా.. వారి మతం పట్ల మిగిలిన వారికున్న నమ్మకాన్ని దెబ్బ తీస్తున్నారన్న విషయం ఈ రాక్షసులకు ఎలా అర్థమవుతుందో..?