ఇరాక్ దళాలు దాదాపు మోసుల్ నగరాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకోబోతున్న తరుణంలో ఇస్లామిక్ స్టేట్ లీడర్ అబు బకర్ అల్ బాగ్దాది సంచలన ప్రకటన చేశాడు. ఇరాకీ దళాలను ప్రతిఘటించాలని తమ జిహాదీలకు చెప్తూ...పారిపోవడం కంటే ఎదురొడ్డి పోరాడటమే తేలిక అన్న విషయం మరచిపోవద్దని బాగ్దాది పిలుపునిచ్చాడు. దేవుని శత్రువులతో చివరి వరకు పోరాడాలని, ఆత్మాహుతి బృందం సభ్యులు దాడులు చేసి శత్రువుల నెత్తురు నదిలా పారేలా చేయాలని ఓ విద్వేష సందేశాన్ని ఇచ్చి తద్వార తన సారథ్యంలోని రాక్షస సంతతిని మరింతగా రెచ్చగొట్టాడు.
ఐఎస్ అనుబంధ మీడియా సంస్థ అల్ పుర్కాన్ ఐసిస్ చీఫ్ బాగ్దాది వాయిస్ తో కూడి ఓ ఆడియో టేప్ ను ఈ ఉదయం విడుదల చేసింది. ఏడాది తర్వాత బాగ్దాది విడుదల చేసిన తొలి ఆడియో టేపు ఇది. ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం చేస్తున్న యుద్ధం తామే విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని మరింత పెంచుతోందని అతను చెప్పాడు. వెనక్కి తగ్గకండి అని బాగ్దాది ఆ టేపులో సందేశం పంపించాడు. ఇదిలాఉండగా..బాగ్దాది ఎక్కడ, ఎలా ఉన్నాడన్న విషయం తెలియకపోయినా.. అతని ఆరోగ్యం పూర్తి క్షీణించిందన్న వార్తలు మాత్రం వస్తున్నాయి. రెండేళ్ల కిందట తొలిసారి మోసుల్‌లో ప్రజల మధ్యకు వచ్చి ఇరాక్ - సిరియాలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బాగ్దాది ప్రకటించాడు. మూడు నుంచి ఐదు వేల మంది ఐఎస్ జిహాదీలు మోసుల్ లో ఉన్నట్లు ఇరాక్ దళాలు అంచనా వేస్తున్నాయి. అయితే గతేడాది నుంచి ఐఎస్ సామ్రాజ్యం కూలుతూ వస్తోంది. తాజాగా వారి చేతిలో ఉన్న అతిపెద్ద నగరం మోసుల్ ను కూడా ఇరాక్ దళాలు హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి.'
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/