ప్రపంచాన్ని తన ఉగ్రవాద చర్యలతో వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలిందని వార్తలు వస్తున్నారు. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు నడుం బిగించిన దేశాల కృషిలో భాగంగా ఐఎస్ ఐఎస్ నాయకుడు అబు బక్ర్ అల్-బాగ్ధాది సిరియాలోని రఖ్ఖా నగరంలో మే నెలలో మరణించాడని రష్యా ఢిఫెన్స్ మినిస్ట్రి శుక్రవారం వెల్లడించింది. రష్యా బలగాలు సిరియాలో స్ట్రైక్ నిర్వహించటంతో ఐఎస్‌ఐఎస్ నేతలు సమావేశానికి సిద్ధమైనట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం తెలిసిందని, దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసినట్లు మినిస్ట్రి తెలిపింది. మే 28న ఐఎస్ ఐఎస్ నేతల సమావేశం జరుగుతుందా లేదా తెలుసుకునేందుకు 00:35 - 00:45 మధ్య డ్రోన్లు ఉపయోగించి, సమావేశ స్థావరంపై రష్యా ఎయిర్ ఫోర్స్ దాడి చేసినట్లు వెల్లడించారు.
ఐఎస్ ఐఎస్ ఉగ్రవాది అబు బక్ర్ అల్-బాగ్ధాది సమావేశంలో మరణించారని వివిధ ఛానెల్లలో ప్రసారం అయ్యిందని మినిస్ట్రి పేర్కొంది. బాగ్ధాదిని చంపినట్లు రష్యా తెలిపిన రిపోర్టుతో ధ్రువీకరించలేమని ఐఎస్ ఐఎస్ పై ఐక్య పోరాటం చేస్తున్న యూఎస్ నేతృత్వ సంస్థ వెల్లడించింది. తీవ్రవాద గ్రూపులో సీనియర్ నేతలు చనిపోయారని, అట్లాగే 30 మంది కమాండర్ లు - 300 మంది పర్సనల్ గార్డ్ లు మృతిచెందినట్లు రష్యా ఢిఫెన్స్ మినిస్ట్రి నివేదిక పేర్కొంది. రఖ్ఖాలోని దక్షిణ సుబర్బ్ లో నిర్దేశించుకున్న కేంద్రంలో ఐఎస్ ఐఎస్ నేతలు సమావేశమయ్యారు.
ఇదిలాఉండగా...ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదంపై చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నా గెలువ లేకపోతున్నామని అమెరికా రక్షణశాఖ మంత్రి జేమ్స్ మ్యాటిస్ నిజాయితీగా అంగీకరించారు. ఆ దేశంలో ఇప్పటికీ తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ ఆధ్యక్షతన జరిగిన సాయుధ దళ సేవల సెనేట్ కమిటీ విచారణ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు ఈ ఏడాది కూడా పెట్రేగిపోయే పరిస్థితి ఉన్నదని, మన విధానాలు మార్చుకుని ఆఫ్ఘన్ కు సైనిక సహాయం పెంచితే శత్రువును నియంత్రించ వచ్చునని మ్యాటిస్ చెప్పారు. సమావేశంలో మెక్ కెయిన్ మాట్లాడుతూ, ఆఫ్ఘన్ తాలిబన్లపై అమెరికా గత ఎనిమిదేళ్లుగా అనుసరిస్తున్న వ్యూహం విఫలమైందన్నారు. అమెరికా సైనికుల త్యాగాల తర్వాత కూడా ఆఫ్ఘన్ అంతర్యుద్ధ దేశంగానే మిగిలిపోయిందని అన్నారు. ఆర్నెల్లయినా ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘన్ విషయంలో ఓ విధానాన్ని రూపొందించుకోలేకపోయిందని మెక్ కెయిన్ విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/