మోసుల్‌ నుంచి ఐఎస్ చీఫ్ పరార్!

Update: 2016-11-04 14:34 GMT
రెండేళ్లుగా ఐఎస్ ఉగ్రవాదుల గుప్పిట్లో నలిగిపోతున్న మోసుల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాక్ దళాలు - సంకీర్ణ సేనలు ఐఎస్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ తోకముడిచి పలాయనం చిత్తగించాడని తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ ఈ విషయాలను వెల్లడించారు. మౌసుల్ పట్టణం నుంచి అబు బకర్ అల్ బగ్దాదీ పరారైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉందనే విషయం బోరిస్ జాన్సన్ -హౌస్ ఆఫ్ కామన్స్‌ కు తెలిపినట్టు "ది డెయిలీ మెయిల్" పేర్కొంది.

గురువారంనాడు ఒక రికార్డెడ్ ఆడియోను బగ్దాదీ విడుదల చేశాడని.. ఇరాక్, సంకీర్ణ సేనలపై విజయం తథ్యమని ఆ ఆడియోలో ధీమా వ్యక్తం చేసిన బగ్దాదీ... శత్రువులకు ఎట్టి పరిస్థితులోనూ వెన్ను చూపద్దని, ఈ పోరాటం సాగించాలని తన అనుయూయులకు పిలుపునిచ్చాడని తెలుస్తోంది. దీన్ని బట్టి బాగ్దాదీ మోసుల్ నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని బోరిస్ జాన్సస్ ‌హౌస్ ఆఫ్ కౌమన్స్‌ కు తెలియజేశారు. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం బగ్దాదీ.. మొసూల్ పట్టణాన్ని వదిలి పరారయ్యాడని, తాను పారిపోతున్నప్పటికీ హింసలో పాల్గొనవలసిందిగా ప్రజలను ఇంటర్‌ నెట్ ద్వారా ప్రోత్సహించడం అతని కూర్రత్వానికి నిదర్శనం అని అన్నారు.

కాగా, 2014 నుంచి మోసుల్ నగరం ఐఎస్ ఉగ్రవాదుల స్వాధీనంలో ఉంది. ఈ నగరాన్ని మళ్లీ తాము స్వాధీనం చేసుకోవడం కోసం ఇరాక్ భద్రత బలగాలు పోరాటం చేస్తున్నాయి. దీంతో ఇరాక్ భద్రత దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ క్రమంలో మోసుల్‌ లో సుమారు 3 వేల నుంచి 5 వేల వరకూ ఐఎస్ సాయుధులు మాటువేసినట్టుగా అమెరికా సంకీర్ణ దళాలు అంచనా వేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News