సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. రాక్షసులు మానవరూపంలో ఉంటే అది ఐసిస్ ఉగ్రవాదులు అని ఒక్కమాటలో వారి పరిస్థితిని పలువురు చెబుతుంటారు. బందీలుగా పట్టుకున్నవారిని ఐసిస్ ఉగ్రవాదులు ఎన్ని రకాలుగా, ఎంత దారుణంగా చంపుతారు అనడానికి ఇప్పటికే చాలా వీడియోలు విడుదల చేశారు. మనుషులను చేతులు వెనుకకు కట్టేసి, మోకాళ్లపై కూర్చోపెట్టి వరుసగా కాల్చుకుంటూ పోవడం, పారిపోమని చెప్పి వెనకనుంచి అత్యంత దారుణంగా కాల్చడం వారికి అతిచిన్న విషయం!! ఇక 2016 రంజాన్ సమయంలో అయితే గొర్రెలను వేళాడదీసే కొక్కేలకు బందీలను వెళాడదీసి, అనంతరం వారి పీకలు తెగకోసి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రేంజ్ లో సాగుతున్న వీరి దారుణాల్లో తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే వారి దుర్మార్గాలను రేపటి తరానికి కూడా ఉగ్గుపాలదశ నుంచే నేర్పిస్తున్న ఉగ్రవాదులు చిన్న పిల్లలను ఏ స్థాయిలో తయారుచేస్తున్నారు అనడానికి తాజాగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే... సుమారు నాలుగేళ్ల బుడతడు ఒక వ్యక్తిని అతి దగ్గర నుంచి గన్ తో కాల్చి చంపడం. అవును... సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు ఒక బుడతడి చేతికి గన్ ఇచ్చి కాల్చమని చెప్పగానే... చేతులు కట్టేసి ఉన్న ఆ ఖైదీపై ఆ కుర్రాడు కాల్పులు జరిపాడు. అత్యంత దగ్గరగా ఉండి కాల్చడంతో వెంటనే ఆ ఖైదీ ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిశాయి. ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన ఈ దారుణమైన వీడియో ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది. పాలుగారే చిన్నారుల చేత కూడా ఈ కిరాతకులు చేయిస్తున్న కిరాతకాలకు ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం అనే చెప్పాలి!!
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/