ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ప్రేమసౌధం తాజ్ మహల్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉన్న ఈ పాలరాతి కట్టడాన్ని పేల్చి వేసే స్కెచ్ బయటపడటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఐసిస్ ఉగ్రవాదులు తాజ్ మహల్ ను టార్గెట్ చేసిన గ్రాఫిక్స్ చిత్రాలు లభించటంతో భద్రత భారీగా పెంచారు. ఉగ్రవాదులు దాడికి ప్రయత్నిస్తే ఎదుర్కునే విధంగా తాజ్ మహల్ వద్ద ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజుల క్రితమే లక్నోలో ఐసిస్ ఉగ్రవాదిగా భావిస్తున్న సైఫుల్లను ఎన్ కౌంటర్ లో పోలీసులు హతమార్చారు. ఐసిస్ ఉగ్రవాదులు భారత్ లో భారీగా విధ్వంసానికి పాల్పడవచ్చన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. తాజ్ కట్టడానికి నాలుగు వైపుల బలగాలను మొహరించారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కాగా, ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించామని, తాజ్ మహల్ టూరిస్టులపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ ప్రీతిందర్ సింగ్ చెప్పారు. సాధారణంగా తాజ్ మహల్ లో సీఐఎస్ ఎఫ్ దళాలు పహారా కాస్తుంటాయి. ఆ కట్టడం బయట యూపీ పోలీసులు భదత్రా నిర్వహణ చూస్తుంటారు. వాంటేజ్ పాయింట్ల వద్ద స్వాట్ కమాండోలు ఉంటారు. ప్రతి రోజు సంసిద్ధంగా ఉన్నామని రుజువు చేసేందుకు మాక్ డ్రిల్స్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఏడాది సుమారు 60 లక్షల మంది పర్యాటకులు తాజ్ మహల్ ను చూసేందుకు వస్తుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/