కర్కశ ఉగ్రవాదుల ముఠా . ఇస్లామిక్ స్టేట్స్ కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాది నివసిస్తున్న స్థావరాలను ఇరాకీ ఆర్మీ చుట్టుముట్టింది. ఐసిస్ కు గట్టిపట్టున్న మోసుల్ పట్టణాన్ని ప్యాకప్ చేసిన సైనిక దళాలు పెద్ద ఎత్తున బాంబులతో దాడులకు పాల్పడుతోంది. ఈ మేరకు తాజాగా వెలువడిన ఓ కథనం ఐసిస్ అంతానికి ఈ దాడులకు ఉదాహరణగా పేర్కొంటూ ఓ కథనం వెలువరించింది.
ఈ పరిణామంపై కుర్దీష్ అధ్యక్షుడు పఫాద్ హుస్సేనీ స్పందిస్తూ బాగ్దాదీ ఐసిస్ సామ్రాజ్యానికి ఏకైక ప్రతినిధిని శాసిస్తున్నాడని..ఆయన్ను ముట్టుబెడితే ఐసిస్ రాక్షస చర్యలకు చెక్ పెట్టినట్లేనని అన్నారు. గత ఎనిమిది నెలలుగా తన సొంత సామ్రాజ్యంగా ముసూల్‌ను ప్రకటించుకున్నబాగ్దాదీ ఈ క్రమంలో అనేక రాక్షస చర్యలకు పాల్పడుతున్నారని హుస్సేనీ మండిపడ్డారు. తాజాగా జరిపే ఈ సైనిక చర్యతో ఐసిస్ ను అంతమొందడం ఖాయమని హుస్సేనీ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా బాగ్దాదీ సొంత ఇలాకాను చుట్టుముట్టిన ఆర్మీ ఈ సందర్భంగా ఎద్ద ఎత్తున బాంబర్లతో దాడులకు పాల్పడినట్లు సదరు మీడియా కథనం వెలువరించింది. ఆ దాడి తీవ్రత చూస్తుంటే బాగ్దాదీ మరణించే ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయన జీవించి ఉంటే ఐసిస్ గురించి లోతుగా ఆరా తీస్తారని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/