ఏపీ ప్ర‌జ‌ల‌కు మైండ్ వాష్‌ త‌ప్ప‌దా?

Update: 2022-12-17 15:30 GMT
ఇదీ.. ఇప్పుడు ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లుసుకున్నా.. జ‌రుగుతున్న‌చ‌ర్చ‌ల ముచ్చ‌ట‌. ఏ టీకొట్టు ద‌గ్గ‌ర చూసినా క‌నిపిస్తున్న సీన్ ఇదే!  మైండ్ వాషైపోద్ది బాబోయ్‌!! అనే మాటే వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. ఏపీ అధికార పార్టీ వైసీపీ కొత్త‌గా తీసుకువ‌స్తున్న గృహ సార‌థుల కార్య‌క్ర‌మ‌మేన‌ని అంటున్నారు. నిజానికి ఇప్ప‌టికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు  కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ఏం చేస్తోందో చెబుతున్నారు. ఏ కుటుంబం ప్ర‌భుత్వం నుంచి ఈ మూడేళ్ల‌లో ఏం తీసుకుందో.. ఎంత‌గా ల‌బ్ది పొందిందో లెక్క‌లు.. తారీకుల‌తో స‌హా వివ‌రిస్తున్నారు. దీంతో నే ప్ర‌జ‌లు త‌మ మైండ్ వాష్ అయిపోతోంద‌ని అంటున్నారు. ఇదిలావుంటే, మ‌రోవైపు వలంటీర్లు కూడా నెల నెలా 1వ తారీకు ఇస్తున్న పింఛ‌న్ స‌మ‌యంలోనూ  జ‌గ‌న్ గురించి వివ‌రిస్తున్నారు. అయితే, ఇది కొన్ని జిల్లాల్లోనే సాగుతోంది.

ఇలా.. ఇప్ప‌టికే ఈ రెండు కార్య‌క్ర‌మాల‌తోనే ప్ర‌జ‌ల‌కు విసుగు వ‌స్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా ప్రారంభించ‌నున్న గృహ సార‌థులు కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఇద్ద‌రిని నియ‌మించ‌నుంది. వీరు చేయాల్సిన‌.. చేయ‌నున్న ప‌నికూడా ఇదే. ప్ర‌భుత్వం ఏం చేస్తోంది.. ఏ కుటుంబానికి ఎంత ల‌బ్ధి చేకూరింది.. అనే వివ‌రాల‌ను మ‌రింత స‌మ‌గ్రంగా వివ‌రించ‌నున్నా రు.

ప్ర‌జ‌ల‌ను వైసీపీకి అనుకూలంగా మార్చ‌నున్నారు. అంతేకాదు.. ఈ గృహ సార‌థులు ఇద్ద‌రు ఉండ‌ను న్నారు. ఒక‌రు పురుష‌, రెండు మ‌హిళ సార‌థులు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసుకుని ముందుకు సాగిన ఈ ప్ర‌చారం ఇక‌, పురుషుల‌కు కూడా త‌గ‌ల‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే.. మొత్తంగా కుటుంబంలో ఓటు హ‌క్కు ఉన్న ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కుండా.. ఏడాది పాటు వీరు వారికి అన్నింటినీ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించి మైండ్ వాష్ చేస్తార‌న్న మాట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News