యుద్ధం చాలామంది చేస్తారు. కానీ.. యుద్ధంలో భాగంగా శత్రు నేల మీదకు వెళ్లటమే కాదు.. చావు నోట్లో వరకూ వెళ్లినట్లుగా శత్రువులకు చిక్కి.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. అరవై గంటల వ్యవధిలో దేశానికి తిరిగి వచ్చిన అరుదైన ఘట్టం మాత్రం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలోనే చోటు చేసుకుందని చెప్పాలి.
ఆయన పాక్ దళాలకు చిక్కినప్పుడు యావత్ దేశం కన్నీళ్లు కారిస్తే.. ఆయన వస్తున్న విషయాన్ని తెలుసుకునే కోట్ల మంది కంటి మీద కునుకు లేకుండా టీవీలకు అతుక్కుపోయి మరి..ఆయన రాక కోపం ఎదురుచూసిన వైనం అరుదైనదిగా చెప్పక తప్పదు.
ఈ అద్భుతవేళలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. విశ్వంతరాళ్లలోని మరో గ్రహం నుంచి అభినందన్ కు అభినందనలు తెలుపుతూ ఒక మెసేజ్ వచ్చింది. భారతీయ కృషికి నిదర్శనంగా అంగారక గ్రహం మీదకు ఇస్రో ప్రయోగించిన మంగళ్ యాన్ మార్స్ లోని ఆర్బిటర్ మిషన్.. అభినందన్ కు నిండైన ఆహ్వానాన్ని పలికింది.
మంగళయాన్ నుంచి ఇస్రో అధికారిక ట్విట్టర్ ఖాతాలొ.. వింగ్ కమాండర్ అభినందన్.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం అంటూ.. ట్వీట్ చేసింది. అంతరిక్షం నుంచి మంగళయాన్ భూమి మీదకు పంపిన రెండో మెసేజ్ ఇదే కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.
మొదటి మెసేజ్ ను తన నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మంగళయాన్ ఒక సందేశాన్ని పంపింది. గత ఏడాది సెప్టెంబరు 29న అంగారక గ్రహం నుంచి ఈ మెసేజ్ రాగా.. దాని తర్వాత వచ్చిన మెసేజ్.. అభినందన్ కు అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మంగళయాన్ ఆవిష్కరణకు ముందు 2013లో ఇస్రో మంగళయాన్ అధికారిక ట్విట్టర్.. ఫేస్ బుక్ ఖాతాల్ని ఓపెన్ చేసింది. ప్రయోగం అనంతరం.. అంగారక గ్రహం నుంచి రెండు మెసేజ్ లు ఇప్పటివరకూ రాగా..అందులో రెండోది అభినందన్ కు అభినందనలు తెలియచేస్తూ వచ్చిన సందేహం కావటం గమనార్హం. ఒక వీరుడి జీవితంలో ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది?