వైసీపీలో కలకలం చెలరేగింది. ఆ పార్టీ ఎంపీపై ఐటీ దాడులు సంచలనమయ్యాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల ఆయోధ్య రాంరెడ్డికి చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. అయోధ్య రాంరెడ్డికి చెందిన ‘రాంకీ’ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు మంగళవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు రాంకీ సంస్థ అనుబంధం కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.15 బృందాలుగా అధికారులు విడిపోయి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థ.. తెలంగాణ , ఏపీ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. 15 చోట్ల ఒకేసారి ప్రారంభమైన దాడులు.. మధ్యాహ్నం నాటికి కూడా కొనసాగుతున్నాయి. ఈ ఐటీ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.