భారత్ కు భారీగా తరలివస్తున్న ఐటీ కంపెనీలు

Update: 2022-05-01 07:42 GMT
ఉక్రెయిన్ పై రెండు నెలలుగా రష్యా కొనసాగిస్తున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడి ఐటీ కంపెనీల కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి సంస్థలన్నీ ఎత్తేశాయి. అక్కడి కార్యకలాపాలను  భారత్  సహా ఇతర దేశాలకు తరలించడంపై దృష్టి సారిస్తున్నామని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.

భారత్ తోపాటు ఫిలిప్పీన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ దేశాలకు ఐటీ ప్రాజెక్టులు తరలిపోతాయని ఫ్రాన్స్ కు చెందిన ఐటీ కన్సల్టింగ్  సేవల సంస్థ ఆటోస్ వెల్లడించింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆ 2 దేశాల్లో నిర్వహిస్తున్న ఐటీ ప్రాజెక్టులను వేరే ప్రాంతాలకు బదిలీ చేసేందుకు చూస్తున్నామని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

ఐటీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు రష్యా-ఉక్రెయిన్ దేశాల్లోని తమ ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలను తాత్కాలికంగా మన దేశానికి మళ్లించే వీలుందని సమాచారం.

భారత్ తోపాటు ఫిలిప్పీన్స్, బ్రెజిల్ , మెక్సికో, టర్కీ దేశాలకు ఐటీ ప్రాజెక్టులు తరలిపోతాయని ఫ్రాన్స్ కు చెందిన ఐటీ కన్సల్టెంట్ సేవల సంస్థ ఆటోస్ తెలిపింది. రష్యాలో ఐటీ కార్యకలాపాలు కొనసాగించలేమని.. అక్కడ నిర్వహిస్తున్న ప్రాజెక్టులను భారత్, టర్కీకి మళ్లిస్తామని స్పష్టం చేశారు.ఇలా వచ్చే ప్రాజెక్టుల్లో కొన్ని హైదరాబాద్ కు చేరుతాయని.. అందువల్ల ఇక్కడ ఐటీ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని స్థానిక ఐటీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా ఇంజనీరింగ్ పరిశోధన.. అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్, బ్యాంక్ ఆఫీస్ నిర్వహణ, కస్టమర్ సపోర్ట్, మెయింటెనెన్స్ షేర్డ్ సర్వీసెస్ విభాగాల ఉద్కయోగాలు ఇక్కడకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల కొత్తగా 50000-60000 వరకూ ఉద్యోగాలు లభిస్తాయని అంచనావేస్తున్నారు.

యుద్ధం ముగిసినా కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధిత క్లయింట్లు మనదేశంలోనే కొనసాగించే అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడి ఐటీ రంగానికి, నిపుణులకు మేలు జరుగుతుంది..

ఇన్నాళ్లు తూర్పు ఐరోపా దేశాలైన రుమేనియా, బల్గేరియా, మాల్డోవా, పోలెండ్ తోపాటు బెలారస్, ఈస్తోనియా, లాత్వియా, లిథువేనియా వంటి దేశాలు తమ ఐటీ అవసరాల కోసం ఉక్రెయిన్ , రష్యా దేశాల మీద ఆధారపడి ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు కూడా రష్యా, ఉక్రెయిన్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ యుద్ధం నేపథ్యంలో తమ కార్యకలాపాలు సజావుగా సాగించుకోలేక ఇప్పుడు ఇతర చీప్ గా మానవవనరులు దొరికే దేశాల వైపు వీరు చూస్తున్న పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News