ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన ఐటీ కంపెనీలు..కానీ, అదే ప్రాబ్లెమ్ ?

Update: 2020-04-07 09:30 GMT

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఉంటుంది అని  ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇదే సందర్భంలో వచ్చే రోజుల్లో  కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని తెలిపాయి. అయితే , ఇదే సమయంలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు కొంత అదనపు వేతనం ఇచ్చాయి. విప్రో - యాక్సెంచర్ - టెక్ మహీంద్రా - హెచ్‌ సీఎల్.. ఇలా పలు ఐటీ కంపెనీలు మధ్యలో నిలిచిన ఉద్యోగ ఆఫర్లపై భరోసా కల్పిస్తున్నాయి.  

అయితే , కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ..ఇప్పటికే ప్రాసెస్‌లో ఉన్న ఉద్యోగాలు లేదా ఆఫర్ లెటర్స్ వచ్చిన వాటి పరిస్థితి ఏమిటనే ఊగిసలాటలో చాలామంది ఉన్నారు. అలాంటి వారికీ కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగాలకి హామీ ఇస్తున్నాయి. ఇప్పటికే కొన్ని  కంపెనీలు వర్చువల్ ఆన్-బోర్డింగ్ రిక్రూట్మెంట్స్ ప్రారంభించాయి. ఇందులో ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. మన దేశంలో అతిపెద్ద రంగాల్లో ఐటీ ఒకటి. ఈ రంగంలోని కంపెనీలు దాదాపు ప్రతి నెల 20,000 ఉద్యోగ ఆఫర్లు ఇస్తుంటాయి

లాక్ డౌన్ ముందు వరకు ఉన్న ఆఫర్లను కొనసాగిస్తామని యాక్సెంచర్ తెలిపింది. వర్చువల్ ఇంటర్వ్యూలు కొనసాగించనుంది. అలాగే, కొత్తగా చేరిన ఉద్యోగులకు వారు చేరినప్పడి నుండే అన్ని కంపెనీ ప్రయోజనాలు అందిస్తామని యాక్సెంచర్ తెలిపింది.  ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల్లో యాక్సెంచర్ ఒకటి.  ఇండియాలో ఈ సంస్థకు 2 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఇప్పటికే  ప్రాసెస్‌ లో ఉన్న ఉద్యోగాలను, ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ ను గౌరవిస్తామని టెక్ మహీంద్రా చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ అన్నారు. ఇప్పటికే తాము ఇచ్చిన అన్ని ఆఫర్ లెటర్స్‌ను గౌరవిస్తామని విప్రో కూడా ప్రకటించింది. ఇన్ఫోసిస్, క్యాప్‌ జెమిని, టీసీఎస్, మైండ్ ట్రీ వంటి కంపెనీలు అదే దారిలో నడిచే అవకాశాలు  కనిపిస్తున్నాయి.
 
అయితే కొత్త ఆఫర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవకాశముంటే ఈ ఆన్‌ బోర్డింగ్ వైపు దృష్టి సారించాయి. కానీ చాలామంది ఈ ఆన్‌ బోర్డింగ్ కోసం లాజిస్టిక్స్, సెక్యూరిటీ ఇష్యూలు ఎధుర్కొంటున్నారు. కొత్త నియామకాల కోసం కొన్ని కంపెనీలు BYOD (బ్రింగ్ యువర్ ఓన్ డివైస్) అంటే మీ ల్యాప్‌ టాప్ మీరు ఉపయోగిండి అనే కాన్సెప్ట్‌ తో ముందుకు వచ్చాయి. అయితే ఇవి కాస్త ఇబ్బందికర అంశాలే అంటున్నారు. అయితే , యాక్సెంచర్, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఆన్‌ లైన్ ఆన్ బోర్డింగ్‌ ను ప్రారంభించాయి. వీటికి ఐటీ బ్యాకెండ్ సపోర్ట్ ఉంటుంది.
Tags:    

Similar News