వామ్మో..చంద్ర‌బాబు మాజీ పీఎస్ ఇంట్లో మూడో రోజు కూడా!

Update: 2020-02-08 09:10 GMT
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇళ్ల‌లో ఐటీ సోదాలు వ‌ర‌స‌గా మూడో రోజు కూడా కొన‌సాగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. గురువారం మొద‌లైన ఈ సోదాలు శుక్ర‌వారం అంతా కొన‌సాగాయి, శ‌నివారం కూడా అధికారులు ఇంకా ఆయ‌న ఇళ్ల‌ను ఖాళీ చేయ‌లేద‌ట‌! ఇప్ప‌టికీ అక్క‌డ లభ్యం అవుతున్న వివ‌రాలు చాలా ఉండ‌టంతో సోదాల‌ను కొన‌సాగిస్తూ ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.

తొలి రోజే శ్రీనివాస్ ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయ‌ల‌కు పైనే అని తేలిన‌ట్టుగా స‌మాచారం. గురువారం రాత్రంతా అధికారులు శ్రీనివాస్ ఇంట్లోనే కూర్చున్నార‌ట‌. సోదాల‌ను కొన‌సాగించార‌ట‌. ఇక శుక్ర‌వారం ప‌గ‌లు కూడా అధికారులు క‌ద‌ల్లేదు. శుక్ర‌వారం రాత్రి, శ‌నివారం ఉద‌యం కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయ‌ని స‌మాచారం.

శ్రీనివాస్ ఇళ్ల‌ల్లో కొన్ని ర‌హ‌స్య సొరంగాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ట‌. వాల్ లాక‌ర్స్ ఉన్నాయ‌ని స‌మాచారం. ఆ వాల్ లాక‌ర్స్ లో అనేక డాక్యుమెంట్లు ల‌భిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇలాంటి డాక్యుమెంట్లు దొర‌కుతూ ఉండ‌టంతో ఇంకా ఏమైనా ల‌భిస్తాయ‌నే దిశ‌గా అధికారులు సోదాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్టుగా స‌మాచారం.

చంద్ర‌బాబు నాయుడుకు శ్రీనివాస్ కేవ‌లం మాజీ పీఎస్ మాత్ర‌మే కాద‌ట‌, ఆయ‌న చంద్ర‌బాబు కుటుంబానికి కూడా స‌న్నిహితుడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. హెరిటేజ్ లో కీల‌క హోదాలో ఉన్న ఒక వ్య‌క్తికి శ్రీనివాస్ మేనల్లుడు అట‌. దీంతోనే ఆయ‌న చంద్ర‌బాబుకు పీఎస్ గా నియ‌మితుడు అయ్యాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా చంద్ర‌బాబు వ‌ద్ద పీఎస్ గా ప‌ని చేసిన వ్య‌క్తి ఇలా వంద‌ల కోట్ల అక్ర‌మాస్తుల‌తో వార్త‌ల్లోకి రావ‌డం తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందిక‌రంగా మారిన‌ట్టుంది.
Tags:    

Similar News