మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అత్యంత ఆఫ్తుడు.. ప్రధాన అనుచరుల్లో ఒకరైన షానవాజ్ హుస్సేన్ ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించటం సంచలనంగా మారింది. అంతేకాదు.. అసద్ పార్టీకి చెందిన పలువురుకార్యకర్తల ఇళ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు జరగటం గమనార్హం.
పాతబస్తీతోపాటు టోలీచౌకీలో 10 చోట్ల ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం రాత్రి మొదలైన ఈ తనిఖీల పర్వం అర్థరాత్రి వరకూ కొనసాగాయి. అసదుద్దీన్ ఓవైసీకి ప్రధాన అనుచరుల్లో ఒకరైన హుస్సేన్ నివాసమైన ఇంజన్ బౌలి.. శాస్త్రిపురం.. చార్మినార్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు.
అదే సమయంలో అసద్‌కు చెందిన మరో అనుచరుడు ఒబైద్ ఇంటిపైనా.. టోలీచౌకీలోని ఆక్తర్ కార్యకర్త ఇళ్లల్లోనూ దాడుల్ని నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ మజ్లిస్ నేతలు.. కార్యకర్తల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు నిర్వహించటం అంటూ లేదు.
అందుకు భిన్నంగా ఇప్పుడు గురి చూసి కొట్టినట్లుగా తనిఖీలు నిర్వహించటం.. పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించటం మజ్లిస్ వర్గాలకు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. తన పార్టీకి సంబంధించిన నేతలు.. కార్యకర్తలకు సంబంధించి ఇప్పటివరకూ ఇలాంటి తనిఖీలను ఎదుర్కొని అసద్‌కు.. తాజా ఎపిసోడ్ పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. తనిఖీలకు సంబంధించిన వివరాల్ని అధికారులు గోప్యంగా ఉంచటం గమనార్హం. మరి.. తాజా తనిఖీల మీద అసద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.