'సుజ‌నా' సంస్థ‌ల‌పై ఈడీ సోదాలు!

Update: 2018-10-10 08:57 GMT
ప్ర‌స్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌ల న‌గారా మోగ‌గా.... ఏపీలో కూడా దాని ప్ర‌భావం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈడీ - ఐటీ సోదాలు తెలుగు రాజ‌కీయ నేత‌ల‌ను క‌ల‌వ‌రపెడుతున్నాయి. తెలంగాణ‌లో రేవంత్ పై ఐటీ - ఈడీ సోదాలు నిర్వ‌హించ‌డం....ఏపీలో కొంద‌రు రాజ‌కీయ నేత‌లు - వ్యాపార వేత్త‌ల సంస్థ‌ల‌పై ఐటీ సోదాలు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపీకి చెందిన మ‌రో అధికార‌పార్టీ నేత‌పై ఈడీ సోదాలు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ - కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రికి చెందిన‌ సుజ‌నా గ్రూప్ ఆఫ్ ఇండ‌స్ట్రీస్ పై ఈడీ సోదాలు నిర్వించిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఈ సోదాలు జ‌రిగాయ‌ని తెలుస్తోంది.

34మంది ఈడీ అధికారులు నాగార్జున హిల్స్ ప్రాంతంలో ఉన్న సుజ‌జా గ్రూప్ ఆఫీస్ లో సోదాలు నిర్వ‌హించార‌ని తెలుస్తోంది. ఒకే అడ్ర‌స్ నుంచి న‌డుపుతోన్న 120 కంపెనీల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. బెస్ట్ - క్రాంప్ట‌న్ కంపెనీల‌కు సంబంధించిన 1000 కోట్ల విలువైన మోస‌పూరిత లోన్ డాక్యుమెంట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీ లాండ‌రింగ్ కింద ఆ డాక్యుమెంట్ల‌ను అధికారులు సీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని ర‌బ్బ‌రు స్టాంపుల‌ను కూడా స్వాధీనం చేసుకున్నార‌ట‌. బెస్ట్, క్రాంప్ట‌న్ కంపెనీల నుంచి సుజ‌నా గ్రూపున‌కు నిధులు మ‌ళ్లించిన‌ట్లుగా సాక్ష్యాధారాల‌ను ఈడీ అధికారులు సంపాదించార‌ట‌. వివిధ ఆస్తిపాస్తుల‌కు సంబంధించిన ప‌త్రాలు, 20ల‌క్ష‌ల న‌గ‌దును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News