వ్యాక్సిన్ పై జగన్ నిర్ణయాన్ని.. ఎంతమంది సీఎంలు ఫాలో అయ్యారో తెలిస్తే అవాక్కే!
కోవిడ్ నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు వ్యాక్సిన్ కు మించిన తరుణోపాయం మరొకటి లేదన్నది తెలిసిందే. ఈ కారణంతోనే.. పలు దేశాలు యుద్ధ ప్రాతిపదికన తమ దేశంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో మన దేశం చాలా ఆలస్యంగా స్పందించిందని చెప్పాలి. కోవిడ్ అంతానికి అవకాశం ఉన్న రెండు టీకాలు దేశీయంగా భారీ ఎత్తున ఉత్పత్తి అవుతున్నా.. వాటిని విదేశాలకు పంపే శ్రద్ధ.. స్వదేశంలోని ప్రజలకు తప్పనిసరిగా అందించాలన్న విషయంపై కేంద్రం చేసిన తప్పులకు.. ఈ రోజున దేశం మూల్యం చెల్లిస్తోంది.
కోవిడ్ టీకా విషయంలో ఆ మధ్యన మోడీ సర్కారు వెలువరించిన పాలసీపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం తెలిసిందే. ఈ సమయంలో.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని ఏపీ సీఎం జగన్.. తన నిర్ణయాన్ని వెల్లడించారు. తమ రాష్ట్రంలోని ప్రజలకు తమ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని.. అందుకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చటంతో పాటు.. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే రెండు సంస్థలకు చెందిన ప్రముఖులతోనేరుగా మాట్లాడి.. తమకు అవసరమైన వ్యాక్సిన్ వివరాల్ని వారితో చర్చించారు.
కేంద్రానికి చెంపపెట్టులా ఉండే జగన్ సర్కారు ప్రకటించిన వ్యాక్సిన్ పాలసీని.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో కావటం ఆసక్తికరంగా మారింది. ఒకరి తర్వాత ఒకరుగా.. జగన్ వ్యాక్సిన్ పాలసీకి మొగ్గు చూపారు. ఐడియాల పుట్టగా అభివర్ణించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. వ్యాక్సిన్ ను ఉచితంగా అందించే విషయంలో.. జగన్ ను ఫాలో కావటం తెలిసిందే.
దేశంలో జగన్ సర్కారు అధికారిక నిర్ణయాన్ని అందిపుచ్చుకొని.. అదే తరహాలో తాము నిర్ణయం తీసుకున్న రాష్ట్రాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా చూస్తే..
- జమ్ముకశ్మీర్
- హిమాచల్ ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- ఉత్తరప్రదేశ్
- పంజాబ్
- హర్యానా
- ఢిల్లీ
- రాజస్థాన్
- గుజరాత్
- మధ్యప్రదేశ్
- మహరాష్ట్ర
- గోవా
- కర్ణాటక
- కేరల
- తమిళనాడు
- తెలంగాణ
- ఒడిశా
- ఛత్తీస్ గఢ్
- ఝూర్ఖండ్
- అసోం
- బిహార్
- పశ్చిమ బెంగాల్
- సిక్కిం