భారతీయత గురించి అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలియజెప్పే సంగతి తెలిసిందే. తనదైన శైలిలో వాటిని ప్రధాని వివరిస్తుంటారు. భారతదేశం మానవాళికి అందించిన యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఇటీవల తన మన్ కీబాత్ లో ప్రధాని తెలిపారు. కరోనా విజృంభించడం - లాక్ డౌన్ నేపథ్యంలో.. 21 రోజుల సమయంలో యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. అయితే, ఇదే విషయం అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంక ట్రంప్ కు ఓ రేంజ్ లో నచ్చేసింది.
మన్ కీబాత్ అనంతరం కూడా ప్రధాని స్పందిస్తూ తనకెప్పుడు ఖాళీ సమయం లభించినా యోగ నిద్ర ఆసనం వేస్తుంటానని.. ఇది ఒత్తిడిని తొలగిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన త్రీడి వీడియోలను కూడా ప్రధాని జత చేశారు. సహజంగానే దీనికి నెట్టింట విశేష స్పందన వచ్చింది. అలా స్పందించిన వారిలో ఇవాంకా కూడా ఒకరు.! ప్రధాని సూచనకు థాంక్స్ చెప్పిన ఇవాంకా ట్రంప్ యోగా ఒత్తిడిని జయిస్తుందని పేర్కొన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రపంచ దేశాధినేతలు - ఇతర ముఖ్యులు ఎంత ఫోకస్ తో ఉన్నారో ఈ ట్వీట్ తెలియజెప్తుందని పలువురు పేర్కొంటున్నారు.
ఇదిలాఉండగా, ఇవాంకా భారత్ లో ఇప్పటివరకు రెండుసార్లు పర్యటించారు. దాదాపుగా రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుయర్ సమ్మిట్ లో ఆమె పాల్గొన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో కూడా కుమార్తె ఇవాంక ట్రంప్ పాల్గొన్నారు. అహ్మదాబాద్ నగరంలోని మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భర్త జారెడ్ కుష్నర్ - అమెరికా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. అధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంక రంగు రంగుల పూలతో తయారు చేసిన మిడ్డీ డ్రెస్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె విమానం దిగిన దగ్గర నుంచి తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆమె వేసుకున్న డ్రెస్ కు పెట్టిన ఖర్చు గురించి జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.