ఏపీలో ఉన్నా, ఏపీ బయట ఉన్నా తెలుగు ప్రజలందరికీ ప్రతి రోజూ ఒక ఫోన్ కాల్ వస్తుంది.. ఒకసారేం ఖర్మ, నాలుగైదు సార్లు కూడా వస్తుంటుంది ఒక్కోసారి. అది ఏపీ సీఎం చంద్రబాబు స్వరంతో వచ్చే ఫీడ్ బ్యాక్ కాల్. చాలామందికి ఇది సాధారణంగానే అనిపించొచ్చు.. ఇంకొందరికి ఇది పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు చేస్తున్న గొప్ప ప్రయత్నంగా కనిపించొచ్చు. కానీ, దీని వెనుక అసలు ఉద్దేశం వేరన్న మాట తాజాగా వినిపిస్తోంది. ఈ కాల్స్‌కు రెస్పాండయ్యే తీరును బట్టి, ఇచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి ఆ వ్యక్తి టీడీపీకి ఓటేస్తాడో లేదో అంచనా వేసి అస్సలు ఓటేయడని తేలితే ఓటర్ల జాబితా నుంచి ఆ వ్యక్తి పేరు లేపేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం అనే ఆరోపణలు వస్తున్నాయి. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తాజాగా ఈ ఆరోపణలు చేశారు.
ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు రీసెంటుగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం వెనుక ఈ కాల్ పాత్ర ఉందన్నది ఆయన వాదన. ఏపిలో సుమారు 30 లక్షల ఓట్లు జాబితాలో నుండి ఎగిరిపోయినట్లు ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.
‘
‘ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తుంది. పాలనపై సంతృప్తిగా ఉన్నారా ? లేకపోతే అసంతృప్తితో ఉన్నారా ? అంటూ అడుగుతారు. ఎవరైనా అసంతృప్తిగా ఉన్నాము అంటే వెంటనే ఫోన్ కట్ చేస్తారు. ఎందుకైనా మంచిదని కొన్ని రోజుల తర్వాత ఓటర్లజాబితాలో పేరుందో లేదో చూసుకోండి’’ అంటూ ఐవైఆర్ ట్విటర్లో ప్రజలకు సలహా ఇచ్చారు. మరి, మీ ఓటు ఉందో లేదో కూడా చూసుకోండి.