చిన్మ‌మ్మే సీఎం..రంగంలోకి జ‌య మేన‌ల్లుడు!

Update: 2017-01-03 16:33 GMT
జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ పార్టీలో త‌న బ‌లం పెంచుకుంటున్నారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విబాధ్య‌తలు చేప‌ట్టిన అనంత‌రం ఇప్ప‌టికే ప‌లువురి ద్వారా చిన్నమ్మ సీఎం కావాలని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు ఈ కోవ‌లోకి జ‌య‌ల‌లిత కుటుంబ స‌భ్యులు వ‌చ్చి చేరారు.  జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ శశికళ అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించి త‌మ‌ మేనత్త జయలలిత ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అదే రీతిలో సీఎం ప‌గ్గాలు కూడా స్వీక‌రించాల‌ని కోరారు. ఈ మేర‌కు త్వ‌ర‌లో ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నార‌ని కూడా ప్ర‌క‌టించారు.

జ‌య‌ల‌లిత అంత్య‌క్రియ‌ల స‌మ‌యం నుంచి శ‌శిక‌ళ‌తో వైపు మొగ్గు చూపిన దీప‌క్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లో త‌మ మేన‌త్త జ‌య‌ల‌లిత వార‌సురాలిగా శ‌శిక‌ళ ఆంటీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నార‌ని ప్ర‌క‌టించారు. ఇది కేవలం త‌న డిమాండ్ మాత్ర‌మే కాద‌ని అన్నాడీఎంకే నాయ‌కులు సైతం త‌మ మేన‌త్త స్థానంలో చిన్న‌మ్మ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని కోరుకుంటున్నార‌ని దీప‌క్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండ‌గా దీప‌క్ వ్యాఖ్య‌ల‌పై శ‌శిక‌ళ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం స్పందించింది. దీపక్ మాటలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని వారు పేర్కొన్నారు. కాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మేన‌త్త వార‌సురాలిగా శ‌శిక‌ళ అరంగేట్రాన్ని స‌హించ‌లేని సంగ‌తి తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించరాదని, సీఎం కుర్చిలో కుర్చోపెట్టరాదని  డిమాండ్ చేసిన క్ర‌మంలో తాజాగా దీప‌క్ ఎంట్రీతో పాటు చిన్న‌మ్మ సీఎం కావాల‌నే డిమాండ్ చేయ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News