విరాట్ కోహ్లి అంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఎంఎస్ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ శర్మ అంటై ముంబై ఇండియన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొన్ని ఫ్రాంచైజీలతో కొందరు ఆటగాళ్ల పేర్లు అలా ముడివేసుకుపోయాయి. ఇలాంటి కోవలోకే వస్తుంది ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేరు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. 2012లో అరంగేట్రం చేసిన జడేజా మధ్యలో గుజరాత్ లయన్స్ కు రెండేళ్లు ఆడాడు. అది కూడా చెన్నైపై నిషేధం విధించినందుకే. లేదంటే పూర్తిగా ఆ ఫ్రాంచైజీతోనే కొనసాగేవాడు. అలాంటి జడేజా మెగా టీ20 టోర్నీలో ఇకపై చెన్నైకు ఆడడం కష్టంగానే కనిపిస్తోంది.
ఆటగాడిగా ఎదిగి.. కెప్టెన్ గా మారి
చెన్నై విజయాల్లో ఆల్ రౌండర్ గా జడేజా పాత్ర మరువరానిది. బంతితో, బ్యాట్ తో పాటు ఫీల్డింగ్ లో జడేజా మెరుపులు అసామాన్యం. 2014 తర్వాత మరింత రాటుదేలిన అతడు బ్యాట్ తో గతంలో కంటే విలువైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అలవోకగా భారీ షాట్లు కొడుతూ టి20 ఫార్మాట్ కు తగినవాడిగా మారాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ధోని వైదొలగగా జడేజాను కెప్టెన్సీ వరించింది.
కానీ, సారథ్యం జడేజా ఆటపై ప్రభావం చూపింది. 10 మ్యాచ్‌లు ఆడిన జడేజా 116 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే చెన్నై విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్ రేసులో వెనుకబడింది. చెన్నై జట్టు యాజమాన్యంతో జడేజాకు విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనికితగ్గట్లే పక్కటెముక గాయాన్ని సాకుగా చూపి లీగ్ మధ్యలో జడేజా తప్పుకొన్నాడు.
ధోనికి శుభాకాంక్షలు చెప్పలేదు..
జడేజా.. ధోనిని మార్గదర్శకుడిగా భావిస్తాడు. అతడి అడుగుజాడల్లోనే రాటుదేలాడు. అసలు జడేజాకు ‘‘సర్’’ అనే నిక్ నేమ్ ను ఇచ్చింది ధోనినే. వీరద్దరి మధ్య సహోదర బంధం ఆ స్థాయిలో ఉండేది. అయితే, అలాండి జడేజా .. చెన్నై జట్టుకు గుడ్‌బై చెప్పనున్నాడా..? వచ్చే ఏడాది జరిగే టోర్నీలో చెన్నై తరఫున ఆడటం లేదా..? తాజా పరిణామాలు ఔననే అనేలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై ఫ్రాంచైజీకి సంబంధించిన అన్ని పోస్టులను డిలీట్ చేశారు. ఏటా జూలై 7న ధోనీకి పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపే జడేజా.. ఈ సారి అలాంటిదేమీ చెప్పకపోవడం ఊహాగానాలను మరింత బలపర్చినట్లయింది.
దీంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జడేజా చెన్నై జట్టును వీడనున్నాడని, వచ్చే ఏడాది జరిగే సీజన్‌లో ఆ జట్టు తరఫున ఆడకపోవచ్చని అభిమానులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. గాయం నుంచి కోలుకున్న జడ్డూ.. ఇటీవలే టీమిండియాలో చేరాడు. జులై 1 నుంచి 5 వరకు ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఆ సమయంలో చెన్నై జట్టు తన ట్విటర్ ఖాతాలో జడ్డూను అభినందిస్తూ పోస్ట్ చేయడం గమనార్హం.
ఏ జట్టు తీసుకుంటుందో..?
జడేజా చెన్నైను వీడితే మరే జట్టుతో చేరతాడనేది ఆసక్తికరం. సొంత రాష్ట్రం గుజరాత్ కనుక గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గతంలోనూ అతడు చెన్నైపై నిషేధం సమయంలో గుజరాత్ లయన్స్ కు ఆడాడు. ఇప్పుడు మళ్లీ అటే మొగ్గుచూపొచ్చు. లేదంటే.. ముంబై, లఖ్ నవూ వంటి జట్లలో ఏదైనా సరే జడేజాను తీసుకునే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ గా కీలక పాత్ర పోషించే జడేజాను ఏ ఫ్రాంచైజీ అయినా ఎందుకు కాదంటుంది? ఇది సరే.. చెన్నై అయినా అతడిని వదులుకుంటుందా..? సయోధ్య కుదుర్చుకుని అట్టి పెట్టుకుంటుందా? చూద్దాం?