సినిమా - క్రికెట్ సెలబ్రిటీలను వాడుకోవాలంటే బీజేపీ తర్వాతే ఎవ్వరైనా. అప్పటికప్పుడు ఫేమ్ లో ఉన్న వారిని బీజేపీ తమ పార్టీ ప్రచార కర్తలుగా వాడుకుంటుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో క్రికెటల్ జడేజా భార్య కూడా చేరారు. రవీంద్ర జడేజా భార్య పేరు రివాబా జడేజా. రీసెంట్ గా ఆమె బీజేపీలో చేరారు. గుజరాత్ నుంచి ఎంపిగా కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. జడేజా ఫ్యామిలీకి గుజరాత్ లో మంచి పేరుంది. దీంతో రివాబా జడేజాను బరిలోకి దించాలని అనుకుంటోంది.
గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు హర్ధిక పటేల్. పటేళ్ల ఉద్యమానికి కూడా నాయకుడు. ఇప్పుడు కాకపోయినా.. తర్వతా అయినా హార్థిక్ తో ఇబ్బంది అనుకున్న బీజేపీ అధినాయకత్వం హార్థిక్ కు చెక్ పెట్టేందుకు రివాబా జడేజాను అతనిపై పోటీకి దింపాలని భావిస్తోంది. హార్థిక్ పటేల్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. దీంతో అతనికి చెక్ పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆధిపత్యం చూపించవచ్చనే భావనలో ఉంది బీజేపీ. ఇక రానున్న ఎన్నికల్లో గుజరాత్ లోని జామ్ నగర్ సీటుని జడేజా భార్య రివేబా జడేజా ఆశిస్తున్నారు. ఇదే సీట్ నుంచి హార్థిక్ పటేల్ కూడా పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. గుజరాత్లోని కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా.. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఎంపీగా గెలవాలని ఆశ పడుతున్నారు. మరి హార్థిక్ పటేల్ ని రివాబా జడేజాతో దెబ్బ కొట్టాలన్న బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.