ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా రాష్ట్ర మంత్రుల టార్గెట్ అసెంబ్లీ సమావేశాల వేదికగా ముందుకు వెళుతున్న జగన్ ఇప్పటికే ప్రభుత్వంపై - స్పీకర్ పై అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు అవిశ్వాసాలు వీగిపోయిన నేపథ్యంలో ఇపుడు సీఎం సహా అమాత్యులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడమే కాకుండా కోర్టులోనూ పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.
తమ ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఆమెను అసెంబ్లీలోనికి అడుగుపెట్టనీయకుండా అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం పట్ల వైకాపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే ఈ రోజు చీకటి రోజుగా అభివర్ణించింది. కోర్టు ఆదేశాలను గౌరవించకుండా రోజాను అసెంబ్లీలోనికి రాకుండా అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ సోమవారం కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వైకాపా అధినేత జగన్ చెప్పారు. లోటస్ పాండ్ లో జరిగిన వైకాపా శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని జగన్ ఈ సందర్భంగా ఆరోపించారు.
ఇదిలాఉండగా సస్పెన్షన్ ఎత్తివేస్తూ కోర్టు ఆదేశించిన కాపీతో వచ్చినప్పటికీ రోజాను అసెంబ్లీలోనికి రానీయకపోవడం దారుణమని వైసీపీ బలంగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ చంద్రబాబు సహా ఆయన మంత్రివర్గ సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను కలిసి ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్ - దేవినేని ఉమామహేశ్వరరావు - అచ్చెన్నాయుడు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.