కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది. ఇలాంటివేళలో.. లాక్ డౌన్ మినహా మరో మార్గం కనిపించని పరిస్థితి. గత ఏడాది మాదిరి సంపూర్ణ లాక్ డౌన్ సాధ్యం కాకున్నా.. పరిమితులతో కూడిన పాక్షిక లాక్ డౌన్ చాలా చాలా అవసరం. బలంగా విస్తరిస్తున్న వైరస్ గొలుసును బ్రేక్ చేయాలంటే.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలకు భిన్నమైనది ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అలాంటి నిర్ణయాన్ని తీసుకునే మూడ్ లో ఆయన ఉన్నట్లుగా లేరు.
తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోనే కాదు.. పక్కనున్న సోదర ఏపీ రాష్ట్రంలోనూ పరిమితులతో కూడిన కఠిన లాక్ డౌన్ (?) ను కర్ఫ్యూ పేరుతో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కొన్ని పరిమితులతో..మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత పురుగు కూడా రోడ్ల మీద కనిపించకుండా ఉండేలా కఠిన ఆంక్షల్ని ఈ రోజు నుంచి అమలు చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో కేసులు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ.. అందుకు కారణం.. తెలంగాణలో కంటే కూడా ఏపీలో నమూనా పరీక్షల్ని భారీగా చేస్తుండటమే. ఈ కారణంగానే తెలంగాణ కంటే ఏపీలో పాజిటివ్ కేసులు ఎక్కువన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. టెస్టుల సంఖ్య మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కారణంగా.. వైరస్ విస్తరణ చిత్రం తెలుసుకోవటానికి సాయం చేస్తుంది. అదే జరిగితే.. దానికి చెక్ పెట్టటం సులువు అవుతుంది.
అయితే.. ఈ విధానాన్ని అమలు చేయటానికి కేసీఆర్ పెద్దగా సుముఖత వ్యక్తం చేయరని చెబుతారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ను ఎవరికి వారు విధించుకున్నారు. కేసుల్ని కట్టడి చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీకి ఎన్నికల మీద ఉన్న మోజు.. కరోనా కంట్రోల్ చేసే విషయంలో లేదన్న మాట తరచూ వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కూడా మోడీని తీసిపోని రీతిలో ఉందని చెప్పక తప్పదు.
సాగర్ ఉప ఎన్నిక.. మున్సిపల్ ఎన్నికలు ముగిసి.. తనకు మొన్నటివరకు సన్నిహితుడు.. ఈ మధ్యనే విరోధిగా మారిన ఈటల తాట తీసే ప్రోగ్రాంను యుద్ధప్రాతిపదికన చేపట్టినప్పుడు.. కరోనాను కట్టడి చేసే విషయంలో విధానాల్ని ఎందుకు రూపొందించలేకపోతున్నారు? అన్నది ప్రశ్న. చూస్తుంటే.. ప్రధాని మోడీని ఆవహించిన మొండితనం కేసీఆర్ ను మొత్తంగా పట్టేసిందని చెప్పక తప్పదు. పక్కనున్న ఏపీలో వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టిన తర్వాత కూడా.. కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయకపోవటం ఏమిటి?