ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు... దేశంలో - రాష్ట్రంలో కూడా అన్ని వర్గాలూ ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోడీ అయితే.... ఈ ఏడాది మహిళా దినోత్సవం మరింత ప్రత్యేకం కావాలన్న ఉద్దేశంతో పార్లమెంటులో ఈ రోజు అంతా మహిళలే మాట్లాడాలని మొన్నే పిలుపునిచ్చారు. అందుకు అన్ని వర్గాల ఆమోదం కూడా దొరికింది. ఆ మేరకు మంగళవారం పార్లమెంటులో మహిళల గళమే వినిపించింది. కానీ..... అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మాత్రం భిన్నంగా సాగాయి. మహిళలకు సంబంధించిన అంశాలే మాట్లాడినా పురుషులే ఎక్కువగా మాట్లాడారు. చర్చలను పక్కదారి పట్టించి ఆరోపణలు - ప్రత్యారోపణలతో గందరగోళం సృష్టించారు కూడా.
తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.... ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఏం చేసిందన్నది వివరించారు. అందుకు విపక్ష నేత జగన్ స్పందించి ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలు అంటూ తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల తరువాత టీడీపీ పాలన ఆరంభమైన ఘటనలను కొన్నిటిని ఉదాహరణలుగా చెప్పారు. దీంతో ఆయనకు కౌంటర్ గా మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు మాట్లాడారు. సభ వాదప్రతివాదాలతో గరంగరంగా సాగింది. పేరుకు మహిళల సంక్షేమానికి సంబంధించి చర్చ అయినా కూడా పురుష సభ్యులే పూర్తిగా డామినేట్ చేసి ఎప్పట్లానే గందరగోళం సృష్టించారు.
జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు న్యాయం చేస్తున్నామని చెప్పటం ఉట్టి మాటేనని విమర్శించారు. తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. మహిళా తహసీల్దారుపై దాడి చేసిన ఎమ్మెల్యేపై కేసులు లేవని అన్నారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి కామాంధులకు బలై పోయిందని అన్నారు. కాల్ మనీ అరాచకాలన్నీ అధికార పార్టీ నేతలవేనని ఆరోపించారు. ఇదేనా మహిళలపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా మహిళా సంక్షేమం ఏమాత్రం అమలు కావడం లేదని....చంద్రబాబువన్నీ తప్పుడు మాటలని ఆయన ఆరోపించారు.
జగన్ ప్రసంగానికి కౌంటర్ గా ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే నీచస్థాయికి జగన్ దిగజారారని మండిపడ్డారు. అన్నీ పాత విషయాలే ప్రస్తావిస్తున్నారని, కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలా వాదప్రతివాదాలతో మహిళల సంక్షేమాన్ని, మహిళా దినోత్సవాన్ని రెండు పార్టీలూ పక్కనపెట్టేశాయి.