ప్రత్యేక హోదా : మొత్తానికి ఒకసారి అడిగాడబ్బా జగన్

Update: 2022-07-05 03:10 GMT
హోదా కోసం మాట్లాడ‌డం చాలా రోజుల త‌రువాత జ‌రిగిన ప‌రిణామం.. అస‌లు ఈ విష‌య‌మై ఇంత వ‌ర‌కూ క‌ద‌లికే లేదు. ఓ సంద‌ర్భంలో ప‌విత్ర పార్ల‌మెంట్ లో కూడా అదొక ముగిసిన అధ్యాయం. ఎన్నిక‌లు వ‌స్తున్నందునే మ‌ళ్లీ హోదాను హుందాగా తెర‌పైకి తెచ్చారా ? అన్న‌ది ఓ ప్ర‌శ్న .. ఓ వ‌ర్గం నుంచి వినిపిస్తోంది.

హోదా కోసం పోరాడితే తెలంగాణ నాయ‌కులు కూడా మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారే ! ఆ విష‌యం కూడా గౌర‌వ స‌భ్యులు మ‌రిచిపోయారు. తాజాగా పీఎం మోడీకి హోదా మాటను గుర్తుచేశారు సీఎం జగన్. మేము పోరాడితే కూడా ఇవ్వని హోదా, మీరు ఇలా తమలపాకుతో కొట్టినట్లు అడిగితే ఇస్తారా అని జగన్ ని నిలదీస్తోంది ప్రతిపక్షం.
 
హోదా త‌ప్ప అన్నీ మాట్లాడ‌డంతో ఆంధ్రా నాయ‌కులు ఆరితేరిపోయారు అని ఓ విమర్శను త‌రుచూ జ‌న‌సేనాని చేస్తుంటారు. ఆ విధంగానే ప‌రిణామాలు కూడా ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. హోదా తెచ్చి ప్ర‌జ‌లు మీకు అందించిన అధికారానికో అర్థం ఇవ్వండి.. అమాయ‌కుల‌పై మీ ప్ర‌తాపం చూప‌డం కాదు అని జగన్ పై పవన్ విమర్శలు చేస్తుంటారు. ఆయ‌న ఏం మాట్లాడినా హోదా ఆవ‌శ్య‌క‌త గురించి మ‌రువ‌లేదు.

ఇదే స‌మ‌యాన చాలా రోజుల త‌రువాత మ‌న ప్రాంతానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని సీఎం జ‌గ‌న్ హోదా ఇవ్వ‌మ‌ని అడ‌గ‌డ‌మే పెద్ద విష‌యం. ఎందుకంటే అస్స‌లు మూడేళ్ల‌లో ఒక్క‌సారి కూడా ఆయ‌న ఈ విష‌య‌మై పెద్ద‌గా ఎక్క‌డా మాట్లాడిన దాఖ‌లాలు అయితే లేవు.

ముఖ్య‌మంత్రి గా ప్ర‌మాణ స్వీకారం చేసిన ముందు, త‌రువాత కూడా ఢిల్లీ వెళ్లినా కూడా ఆయ‌న మాట్లాడ‌లేదు ఈ విష‌య‌మై..! దేవుడి ద‌య ఉంటేనే హోదా వ‌స్తుంద‌ని, మా సపోర్ట్ లేకపోయినా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఫాం చేసే శ‌క్తి తెచ్చుకుంది క‌నుక నేనేం చేయ‌లేను అని ఓ నిస్స‌హాయ‌త‌ను ఇంగ్లీషులో వ్య‌క్తం చేసి వెళ్లారు. ఆ త‌రువాత రేగిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో మీడియాను అడ్ర‌స్ చేయ‌కుండానే ఉంటున్నారు. ఎప్పుడు వెళ్లినా ప్ర‌ధానితో స‌మావేశానికి సంబంధించి ఏ వివ‌రం కూడా మీడియాకు చెప్ప‌కుండా వెళ్లిపోతున్నారు.

తాజాగా ఆయ‌న భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రిగిన స భ‌కు విచ్చేసిన ప్ర‌ధానికి  హోదా విష‌య‌మై విన్నవించ‌డం శుభ పరిణామం. అయినా... నిరసనలు చేసినా ప్రాణాలు పోయినా పట్టించుకోని మోడీ రిక్వెస్టులు చేస్తే  ఇస్తాడా అన్నది అతిపెద్ద అనుమానం.

మరో వైపు భీమవరం మీటింగులో కూడా తెలంగాణ డిస్కంలు ఏపీకి చెల్లించాల్సిన రూ. 6,627 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జగన్ మోడీని కోరినట్లు అధికార పార్టీ చెబుతోంది.
Tags:    

Similar News