వైర‌ల్‌ గా జ‌గ‌న్ కేబినెట్!...స‌భాప‌తిగా ద‌గ్గుబాటే!

Update: 2019-05-16 16:10 GMT
ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో వారంలో రానున్నాయి. గ‌త నెల 11న పోలింగ్ ముగిసినా... సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటు విప‌క్ష వైసీపీతో పాటు అటు అధికార టీడీపీ త‌మ‌దే గెలుపంటూ ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ ధీమా టీడీపీలో కంటే వైసీపీలోనే కాస్తంత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. 2014 ఎన్నికల్లోనే వెంట్రుక వాసిలో అధికారం చేజారింద‌ని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఈ ద‌ఫా మ‌రింత ప‌క‌డ్బందీగానే ముందుకు సాగారు. పోలింగ్ స‌ర‌ళి పరిశీలించిన త‌ర్వాత గెలుపు త‌మ‌దేనంటూ ధీమాను వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌... ఇక‌పై త‌న కార్య‌కలాపాల‌న్నీ కూడా ఏపీ నుంచేన‌ని తేల్చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే లోట‌స్ పాండ్ నుంచి తాడేప‌ల్లికి వైసీపీ కార్యాల‌యం త‌ర‌లిపోయింది.

ఎన్నిక‌ల్లో గెలుపు ప‌క్కా అని తేల్చుకున్న త‌ర్వాతే జ‌గ‌న్ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా దాదాపుగా దృవీక‌రించుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మేన‌ని - మ‌రి అలాంట‌ప్పుడు ఆయ‌న కేబినెట్ లో ఎవ‌రెవ‌రు ఉంటారు? ఎవ‌రికి ఏ శాఖ అన్న విష‌యాల‌పై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పూర్తి స్థాయి కేబినెట్ లో జ‌గ‌న్ ఎవ‌రెవ‌రికి ఏఏ శాఖ‌లు కేటాయిస్తార‌న్న స‌మ‌గ్ర స‌మాచారం ఉన్న ఈ పోస్ట్ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. స్పీకర్ పోస్టును ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు కేటాయించ‌నున్న జ‌గ‌న్‌... డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని మ‌హిళా నేత పాముల పుష్ప‌ శ్రీ‌ వాణికి ఇవ్వ‌నున్న‌ట్లుగా ఈ పోస్ట్ తెలిపింది. ఇక‌ ఈ పోస్ట్ ప్ర‌కారం జ‌గ‌న్ కేబినెట్ ఇలా ఉంటుంద‌ట‌.

ముఖ్యమంత్రి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

మంత్రులు ................శాఖలు

1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి              -హోంశాఖ
2. బొత్స సత్యనారాయణ              - రోడ్లు మరియు భవనాలు
3. ధర్మాన ప్రసాదరావు                -రెవెన్యూశాఖ
4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి            -ఆర్థిక శాఖ
5. కొడాలి నాని                          -భారీ నీటిపారుదల శాఖ
6. గడికోట శ్రీకాంత్ రెడ్డి                 -మున్సిపల్ శాఖ
7. తానేటి వనిత                         -స్త్రీ - శిశు సంక్షేమ శాక  
8. పిల్లి సుభాష్ చంద్రబోస్             -పౌర సరఫరాలుశాఖ
9. అవంతి శ్రీనివాస్                     -వైద్య ఆరోగ్యశాఖ
10. కురసాల కన్నబాబు               -విద్యాశాఖ
11. తమ్మినేని సీతారాం                 -బీసీ సంక్షేమం
12. శిల్ప చక్రపాణి రెడ్డి                  -అటవీశాఖ
13. వై. విశ్వేసర్ రెడ్డి                    -న్యాయశాఖ 
14. కోన రఘుపతి                      -దేవాదాయ ధర్మదాయశాఖ
15. ఆనం రాంనారాయణ రెడ్డి          -పంచాయితీరాజ్
16. మోపిదేవి వెంకటరమణ           -ఐటీ శాఖ మంత్రి
17. ఆర్. కే. రోజా                       -విద్యుత్ శాఖ 
18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి             -భూగర్భ గనులశాఖ
19. గ్రంధి శ్రీనివాస్                      -సినిమాటోగ్రఫీ
20. ఆళ్ళ నాని                          -కార్మిక - రవాణా శాఖ
21. కె. భాగ్యలక్ష్మి                      - సాంఘీక సంక్షేశాఖ
22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి               -వ్యవసాయ శాఖ మంత్రి
23. అమంచి కృష్ణ మోహన్           -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24. కె. ఇక్బాల్ అహ్మద్               -పర్యావరణ శాఖ
25. కొక్కిలిగడ్డ రక్షణనిధి              -హౌసింగ్
26. కాకాని గోవర్ధన్ రెడ్డి               -భారీ పరిశ్రమల శాఖ
Tags:    

Similar News