చింతమనేని ప్రభాకర్... గతంలో ఏమో తెలియదు గానీ... మహిళా తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడితో ఈ పేరంటే తెలియని వారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేరనే చెప్పాలి. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన వనజాక్షిపై చింతమనేని దాడి చేయడమే కాకుండా కింద పడేసి జుట్టు పట్టి లాగిన వీడియో పెను దుమారమే రేపిందని చెప్పాలి. రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులకు ఒక్కతాటికి పైకి తెచ్చిన ఈ ఒక్క ఘటనతో చింతమనేనికి ఎక్కడ లేని పేరు వచ్చేసింది. టీడీపీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న ఈయన... ఈ ఘటనకు ముందుగానే ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ పదవి కూడా దక్కించుకోగలిగారు.
చంద్రబాబుకు అనుచరుడిగా కొనసాగుతున్న చింతమనేని... ఉన్నదున్నట్లు మాట్లాడే తత్వమున్న నేతగా ఆంధ్రా జనాలకు తెలుసు. తనదైన శ్లాంగ్ లో నిర్మోహమాటంగా మాట్లాడే చింతమనేని... రాయలసీమలోని జేసీ దివాకర్ రెడ్డిలాగే... ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్నారు. విపక్షం వైసీపీ - ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా ఇటీవల మాటల తూటాలు పేలుస్తున్న చింతమనేని.. తన మాట తీరును కూడా బాగానే మార్చేశారు. టీడీపీకి వ్యతిరేకులుగా ఉన్న వారినంతా కూడా తనకూ వ్యతిరేకులేనన్న కోణంలో ఆలోచించే చింతమనేని... తాను చేసే దందాపై ఏ ఒక్కరు వేలెత్తి చూపినా సహించే రకం కాదన్న విషయం చాలా సందర్భాల్లోనే తేటతెల్లమైంది.
ఇక అసలు విషయానికి వస్తే... నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత లాబీల్లో నిలుచున్న చింతమనేని తన పార్టీ ఎమ్మెల్యేలతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. అదే సమయంలో సభలో నుంచి బయటకు వచ్చిన జగన్... తన కార్యాలయం వైపు వెళుతూ చింతమనేనిని చూశారు. ఇటీవల తరచూ వార్తలకు ఎక్కుతున్న చింతమనేని కనబడగానే... జగన్ కు ఆయనను పిలవాలనిపించిందో? ఏమో? తెలియదు గానీ... ఆయనను పేరు పెట్టి పిలిచారు. జగన్ నోట నుంచి వినిపించిన చింతమనేని ప్రభాకర్ అన్న మాట అక్కడ గోలగోలగా ఉన్న వాతావరణంలో చింతమనేని చెవికి వినపడలేదట.
మరోమారు కాస్తంత గట్టిగా నోరు విప్పిన జగన్... చింతమనేని ప్రభాకర్ చౌదరి అంటూ పిలిచారట. ఈ పిలుపు విన్న చింతమనేని వెనక్కు తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారట. తనను జగన్ పిలవడమా? అన్న ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న వెనువెంటనే జగన్ వద్దకెళ్లిన చింతమనేని... సార్... సార్ అంటూ చేతులు పట్టేసుకున్నారట. ఆ తర్వాత చింతమనేనికి కుశల ప్రశ్నలేసిన జగన్... అక్కడి నుంచి వెళ్లిపోయారట. జగన్ వెళ్లిపోయిన తర్వాత కూడా చింతమనేని జగన్ వెళ్లిన వైపే చూస్తూ నిలబడిపోయారట. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఈ ఆసక్తికర దృశ్యాన్ని కన్నార్పకుండా చూడటం కనిపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/