ఆ సీఎం జగన్ కు చాలా క్లోజ్ అంట

Update: 2017-01-16 06:47 GMT
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తులు చాలా చిత్రంగా ఉంటాయి. అన్నింటికి మించి.. మిగిలిన అధినేతల మాదిరి ఆయనకు సంబంధించిన చాలా విషయాలు పెద్దగా బయటకు రావు. గుట్టుగా పావులు కదిపేయటం.. అవసరానికి వాటిని బయటకు తీయటంలో జగన్ తీరు వేరుగా ఉంటుందని చెబుతుంటారు. అక్కడెక్కడో ఉన్న యూపీకి.. ఏపీలో ఉన్న జగన్ కు మధ్య దూరం ఎక్కువే అయినప్పటికీ.. యూపీ సీఎంతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఏపీలో అధికారమే లక్ష్యంగా కాకుండా.. అవసరమైతే జాతీయస్థాయిలో చక్రాన్ని తిప్పేందుకు వీలుగా జగన్ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల తండ్రి మీద తిరుబాటు ప్రకటించి.. యూపీ రాజకీయాల్లో కీలకంగా మారిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ తో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అఖిలేశ్ తండ్రి మీద తిరుబాటు చేస్తే.. జగన్.. తనకు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మీద తిరుబాటు చేసి సొంతంగా పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ ఇద్దరి తిరుగుబాటు అధినేతల మధ్య దోస్తానా ఒక స్థాయిలో ఉందని.. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించేందుకు వీలుగా.. వారి మధ్య ఒక అవగాహన కుదిరినట్లుగా చెబుతున్నారు. విపక్ష నేతగా ఉండి కూడా.. ఇతర రాష్ట్రాల సీఎంలతో సన్నిహిత సంబంధాలు మొయింటైన్ చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News