ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికార , ప్రతిపక్షాల చర్యలతో వేడి పుట్టిస్తున్నాయి. ఇంత చలిలోనూ మాటల మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై అసెంబ్లీలో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. అనూహ్యంగా ఉప్పు నిప్పులుగా అసెంబ్లీలో చెలరేగిపోయే సీఎం జగన్, ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడుల మధ్య ప్రేమ, అప్యాయత వెల్లివిరియడం నేతలందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ సమావేశానికి సీఎం జగన్ తోపాటు మంత్రులు, చీఫ్ విప్ లు, టీడీపీ పార్టీ నుంచి శాసనసభా పక్ష ఉప అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల యాక్సిడెంట్ కు గురైన అచ్చెన్నాయుడి వద్దకు స్వయంగా వెళ్లిన సీఎం జగన్ ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చేతికి అయిన గాయం చూసి తగ్గిందా అని పరామర్శించారు.
ఇక సీఎం జగన్ స్వయంగా వచ్చి అడగడంతో అచ్చెన్నాయుడు కూడా యాక్సిడెంట్ పై వివరించారు. ఈ క్రమంలోనే కలుగజేసుకున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ‘మీ గురించి మా సీఎం జగన్ ఎంత ప్రేమగా అడిగారో చూడండి’ అంటూ అచ్చెన్నను చూస్తూ అడిగారు. దీనికి అచ్చెన్న కూడా సమాధానమిచ్చాడు..
‘నాకు.. జగన్ కు వ్యక్తిగతంగా ఏముటుంది చెప్పండి.. మాది వేరే పార్టీ.. మీది వేరే పార్టీ అనే దూరం మినహా కోపం ఏముంటుంది’ అని సమాధానమిచ్చాడు అచ్చెన్న..
ఇలా అసెంబ్లీ బీఏసీ సమావేశంలో ఉప్పునిప్పులైన జగన్, అచ్చెన్నల మధ్య ప్రేమ, అప్యాయత అందరినీ కట్టిపడేసింది..