దాసరి ఒక యుగకర్త-జగన్

Update: 2017-05-31 05:54 GMT
దర్శకరత్న దాసరి నారాయణరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. దాసరి కుటుంబానికి ఆయన తన సంతాపం ప్రకటించారు. దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని జగన్ అన్నారు. రికార్డు స్థాయిలో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడిగా మాత్రమే కాకుండా.. నటుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా.. పత్రికాధిపతిగా.. అన్నింటికీ మించి ఓ మంచి మనిషిగా దాసరి ఎప్పటికీ గుర్తుండిపోతారని జగన్‌ అన్నారు.

దశాబ్దాల పాటు దాసరి తెలుగు సినీ రంగానికి పెద్ద దిక్కుగా దాసరి ఉన్నారని.. సినిమా రంగంలో ఆయన ఒక యుగకర్త అని జగన్ పేర్కొన్నారు. దాసరి తెలుగు సినిమా రంగంలతో ఒక విప్లవాన్ని సృష్టించారని.. కథే హీరోగా ఆయన తిరుగులేని చిత్రాలను నిర్మించారని కొనియాడారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని జగన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాసరి మృతికి సంతాపం ప్రకటించారు. తెలుగు చలనచిత్ర రంగం మూలస్తంభాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దాసరి పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలిచారని కొనియాడారు. దాసరి మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దన్నను కోల్పోయినట్లయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తంచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News